బాలయ్య, చిరు బాటలో తేజు?
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్లో ప్రస్తుతం చారిత్రాత్మక, పిరియాడికల్ చిత్రాల హవా కొనసాగుతోంది. గత ఏడాది నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో 100వ సినిమాగా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చేసి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే.. మరో అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’ అనే చారిత్రాత్మక చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో.. బ్రిటీషు వారిని ఎదిరించిన తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరు కనిపించనున్నారు.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు వీరి బాటలో ఓ యంగ్ హీరో కూడా నడుస్తున్నట్టు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. ‘పిల్ల నువ్వు లేని జీవితం’తో సినీ కెరీర్ను ఆరంభించారు మెగాహీరో సాయిధరమ్ తేజ్. తొలినాళ్ళలో విజయాలను చూసిన ఈ హీరో.. ప్రస్తుతం పరాజయాల బాటలో ఉన్నారు. కాగా.. ఇప్పుడు ‘శ్రీ కృష్ణదేవరాయ’ కాలం నాటి కథలో నటించేందుకు ప్లాన్ చేస్తున్నారట ఈ యువ కథానాయకుడు. ‘బిందాస్’, ‘రగడ’, ‘దూసుకెళ్తా’ లాంటి కమర్షియల్ మూవీలను తెరకెక్కించిన వీరు పోట్ల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని సమాచారం. త్వరలో ఈ సినిమాపై మరింత క్లారిటీ రానుంది. కాగా.. ఈ నెల 6న తేజు నటించిన ‘తేజ్ ఐ లవ్ యు’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com