'తేజ్ ఐ లవ్ యు'.. ప్రత్యేకత అదే
Send us your feedback to audioarticles@vaarta.com
తొలి చిత్రం ‘తొలిప్రేమ’తో ఘనవిజయాన్ని అందుకున్న దర్శకుడు ఎ.కరుణాకరన్. ఈ సినిమాతో టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌ల సరసన చేరిపోయారు ఈ యూత్‌ఫుల్ మూవీస్ స్పెషలిస్ట్. ఎన్నో ఫీల్ గుడ్ మూవీస్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసిన ఈ దర్శకుడికి కొంతకాలంగా ఆశించిన విజయం దక్కడం లేదు. ఈ క్రమంలో మెగాహీరో సాయిధరమ్ తేజ్‌తో తాజాగా ‘తేజ్ ఐ లవ్ యు’ తెరకెక్కించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు నిర్మించారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. ఈ సినిమా దర్శకుడిగా కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన 10వ సినిమా కాగా.. ఈ చిత్రంలో నటించిన హీరో సాయిధరమ్ తేజ్‌కి కూడా ఈ చిత్రం 10వది కావడం విశేషం. కాగా.. విజయం కోసం ఎదురుచూస్తున్న ఈ ఇద్దరికి ఈ సినిమా ఎంతో ప్రత్యేకమైనది. మరి ఈ చిత్రంతో ఈ ద్వయం మళ్ళీ పూర్వ వైభవం సాధిస్తారో లేదో తెలియాలంటే ఈ శుక్రవారం అంటే 6వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments