'తేజ్‌ ఐ లవ్‌ యు' ఫస్ట్‌ సాంగ్‌ లాంచ్‌

  • IndiaGlitz, [Saturday,June 02 2018]

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు, వల్లభ నిర్మిస్తున్న చిత్రం 'తేజ్‌'. ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. అన్ని కారక్రమాలు పూర్తి చేసి జూన్‌ 29న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కాగా, ఈ చిత్రంలోని మొదటి పాట శనివారం సాయంత్రం విడుదలైంది. అయితే రొటీన్‌కి భిన్నంగా ఈ పాటను విడుదల చేశారు. 'తేజ్‌ క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌' పేరుతో 'తేజ్‌ ఐ లవ్‌ యు' యూనిట్‌ సభ్యులు, రేడియో జాకీల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ జరిగింది. ఎంతో ఉత్సాహంగా, మరెంతో సరదాగా సాగిన ఈ మ్యాచ్‌లో 'అందమైన చందమామ నీవేనా.. నిన్ను నేను అందుకుంది నిజమేనా..' అంటూ సాగే ఫస్ట్‌ సాంగ్‌ను లాంచ్‌ చేశారు. సాహితి రచించిన ఈ పాటను హరిచరణ్‌, చిన్మయి గానం చేయగా గోపీసుందర్‌ సంగీతాన్ని సమకూర్చారు. ఈ పాటను ప్యారిస్‌లో శేఖర్‌ మాస్టర్‌ నృత్య దర్శకత్వంలో చిత్రీకరించారు.

సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌, జయప్రకాశ్‌, పవిత్రా లోకేశ్‌, పృథ్వీ, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్‌ రవి, అరుణ్‌ కుమార్‌ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి లిరిక్స్‌: చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి, సాహితి, పోతుల రవికిరణ్‌, గోశాల రాంబాబు, స్టంట్స్‌: వెంకట్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సతీశ్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: మోహన్‌, చీఫ్‌ కో డైరెక్టర్‌: చలసాని రామారావు, ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఆర్ట్‌: సాహి సురేశ్‌, సంగీతం: గోపీ సుందర్‌, సినిమాటోగ్రఫీ: అండ్రూ.ఐ, మాటలు: డార్లింగ్‌ స్వామి, సహ నిర్మాత: వల్లభ, నిర్మాత: కె.ఎస్‌.రామారావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్‌.

More News

కోల్‌క‌త్తాలో '2 స్టేట్స్' సెకండ్ షెడ్యూల్ పూర్తి

లక్ష్య ప్రొడ‌క్ష‌న్స్‌ , ప్రొడక్షన్స్ no.1 గా  రూపొందిస్తున్న చిత్రం '2 స్టేట్స్‌' (వర్కింగ్ టైటిల్ ). చేత‌న్ భ‌గ‌త్ రాసిన న‌వ‌ల '2 స్టేట్స్‌' ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా

తెలుగు మూవీ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ యూనియ‌న్ సిల్వ‌ర్‌ జూబ్లి వేడుక‌ల‌కి ముఖ్యఅతిథిగా సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు

తెలుగు సినిమా 24 క్రాఫ్ట్స్ లో ముఖ్య‌మైన విభాగాల్లో తెలుగు మూవీ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ యూనియ‌న్ ఒక‌టి..

నిఖిల్ 'ముద్ర' ఫస్ట్ లుక్ కు మంచి స్పందన

యువహీరో తాజాగా నటిస్తోన్న సినిమా ‘ముద్ర’. ‘ఠాగూర్’ మధు సమర్పిస్తున్న ఈ సినిమాను ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్,

శ్రీనివాస‌రెడ్డి అలా అడిగేశాడా?

`గీతాంజ‌లి`, `జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా` సినిమాల‌తో హీరోగా నిల‌దొక్కుకునే ప్ర‌య‌త్నం చేశారు శ్రీనివాస‌రెడ్డి.

రానాకి బీపీ ఎందుకొచ్చిందంటే..?

`బాహుబ‌లి`, `ఘాజీ`, `నేనే రాజు నేనే మంత్రి` వ‌రుస హిట్ల మీద ఉన్నారు హీరో రానా.