మీ టూ ఎఫెక్ట్‌.. హీరోయిన్‌కి గంట‌కు రెండు ల‌క్ష‌లు

  • IndiaGlitz, [Friday,December 14 2018]

సినీ, రాజ‌కీయ‌, క్రీడా రంగంలోని మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల‌పై మీ టూ ఉద్య‌మం ఉధృతంగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. సినీ రంగం విష‌యానికి వ‌స్తే ప‌లువురు న‌టీమ‌ణులు త‌మ‌న‌కు ఎదురైన లైంగిక వేధింపుల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేస్తున్నారు. తాజాగా మ‌ల‌యాళ న‌టి గాయ‌త్రి అరుణ్ త‌ను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల స‌మ‌స్య‌ను వెల్ల‌డించింది.

రోహ‌న్ అనే య‌వకుడు త‌న కోరిక తీర్చ‌మ‌ని అలా తీరిస్తే గంట‌కు రెండు ల‌క్ష‌లు ఇస్తాన‌న్న‌ట్లు ఆమెతో చేసిన చాట్‌ను స్క్రీన్ షాట్ తీసి ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది. ఈ విష‌యం మ‌న మ‌ధ్య‌నే ఉంటుంద‌ని కూడా ఈ సంద‌ర్భంగా స‌ద‌రు రోహ‌న్ చాట్‌లో పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

ఈ విష‌యంలో గాయ‌త్రి అరుణ్‌కి పెద్ద ఎత్తున మ‌ద్ధ‌తు ల‌భిస్తుంది. అలా ప్ర‌వ‌ర్తించిన రోహ‌న్‌ను అరెస్ట్ చేయాల‌ని నెటిజ‌న్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ కుర్రాడు మైన‌ర్ కావ‌డం.. అత‌డి త‌ల్లిదండ్రులు క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డంతో తాను లీగ‌ల్‌గా ప్రోసీడ్ కాలేద‌ని గాయత్రి అరుణ్ చెప్పుకొచ్చింది.