టెక్నికల్ పద్ధతిలో రానా పెళ్లి..!!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ హల్క్ హీరో రానా తన ప్రేయసి మిహీకా బజాజ్‌ను ఆగస్ట్ 8న పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలో దగ్గుబాటి వారికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వీరి మూడోతరంగా సినీ రంగంలో తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు రానా దగ్గుబాటి. వీరి పెళ్లి చాలా సింపుల్‌గానే జరుగుతుందట. ముందుగా ఈ పెళ్లిని ఫలక్నామా ప్యాలెస్‌లో చేయాలని భావించినప్పటికీ పరిస్థితులు సరిగా లేని కారణంగా ఇప్పుడు పెళ్లిని రామానాయుడు స్టూడియోలోనే చేయాలనుకుంటున్నారట. ఎందుకంటే ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ చాలా ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వివాహం చేస్తే ఎంత మాత్రం సేఫ్‌గా ఉంటుందనే విషయంలో పెద్దలు ఆలోచనలో పడ్డారట. అందుకని ఇంటి దగ్గరే వీరి పెళ్లిని ప్రభుత్వ విధి విధానాలతో పూర్తి చేయాలని అనుకుంటున్నారట.
సమాచారం మేరకు రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తులు 30 మంది లోపే ఈ పెళ్లికి హాజరవుతారట. అయితే రానా తన స్నేహితులు కొందరు సినీ పెద్దలకు తన పెళ్లిని వర్చువల్ టెక్నాలజీ పద్ధతిలో చూపించేలా సన్నాహాలు చేస్తున్నాడని అంటున్నారు. బేసిగ్గా టెక్కీ అయిన రానా తన టెక్నికల్ తెలివి తేటలను పెళ్లి చేసుకోవడంలో చూపిస్తున్నాడన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com