చిరు150వ సినిమా టీజర్...
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి నటించనున్న 150వ సినిమా గురించి ఎప్పటి నుంచో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చిరు 150వ సినిమా ప్రారంభం కావాలి. కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఊహించని విధంగా చరణ్ బ్రూస్ లీ సినిమాలో..చిరు ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. దసరా కానుకగా బ్రూస్ లీ చిత్రం అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే బ్రూస్ లీ చిత్రం లో చిరు నటిస్తున్నారు. కనుక ఈ సినిమానే చిరు 150వ సినిమా అవుతుంది కదా..అని డైరెక్టర్ శ్రీను వైట్లను అడిగితే...చిరు 150వ సినిమాకి ఇది ఒక టీజర్ లాంటిది. ఒకే సినిమాలో చిరు, చరణ్ లను డైరెక్ట్ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందంటున్నారు. ఈ నెలాఖరులో చిరు నటించే సన్నివేశాలను షూట్ చేస్తామని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com