రాధేశ్యామ్: 'ప్రేరణ' ఎవరు, విక్రమాదిత్యతో పరిచయం ఎలా.. పూజా హెగ్డేపై టీజర్!
Send us your feedback to audioarticles@vaarta.com
పాన్ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా పూజాహెగ్డే ఆడిపాడనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ క్యారెక్టర్‌పై ఇప్పటికే టీజర్ వచ్చింది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం టీజర్‌ను రిలీజ్ చేసి అభిమానులను ఖుషీ చేసింది. ఇక, 'రాధేశ్యామ్' చిత్రంలో 'ప్రేరణ' పాత్ర పోషిస్తున్న పూజా హెగ్డేకు సంబంధించిన టీజర్‌ను కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య అనే పామిస్ట్ (హస్తసాముద్రికుడు) పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. తన ప్రేయసి ప్రేరణ జాతకం విక్రమాదిత్యకు ముందే తెలుస్తుందని, దీని ఆధారంగానే సినిమా నడుస్తుందని ఫిలింనగర్ టాక్.
1980 సమయంలో యూరప్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఈ సినిమా చిత్రీకరణ చాలావరకూ ఇటలీలోనే జరిగింది. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత అలనాటి బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ఈ సినిమాతో తెలుగు తెరపై సందడి చేయనున్నారు. కృష్ణంరాజు, సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, కునాల్‌రాయ్ కపూర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, మిథున్, అనూమాలిక్, మనన్భరద్వాజ్(హిందీ), సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహాంస. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 14న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments