హ్యాట్రిక్ కోసం జత కడుతున్నారు..
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేనిది హిట్ కాంబినేషన్. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన తొలి సినిమా `డాన్ శీను` సినిమాలో రవితేజ హీరోగా నటించాడు. డాన్ శీను పెద్ద హిట్ అయ్యింది. మళ్ళీ వీళ్ళిద్దరీ కాంబినేషన్లో వచ్చిన సినిమా `బలుపు`. ఈ సినిమా కూడా సూపర్‌హిట్ అయ్యింది. హ్యాట్రిక్ హిట్ కోసం మళ్ళీ వీరిద్దరూ జత కడుతున్నారు.
గోపీచంద్ మలినేని గత చిత్రం `విన్నర్` బాక్సాఫీస్ వద్ద ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో గోపీచంద్ మలినేని ఇప్పుడు తనకు అచ్చొచ్చిన రవితేజతో సినిమా చేయాలనుకుంటున్నాడు. రీసెంట్గా రవితేజకు లైన్ చెప్పాడట. లైన్ నచ్చడంతో స్క్రిప్ట్ సిద్ధమవుతుందట. ఆగస్టు తర్వాత సినిమా గురించిన పూర్తి సమాచారం తెలుస్తుంది. రాజాది గ్రేట్, టచ్ చేసి చూడు చిత్రాలు చేస్తున్న రవితేజ నెక్ట్స్ కూడా రెండు సినిమాలు చేయాలనుకుంటున్నాడు. అందులో గోపీచంద్ మలినేని చిత్రం కూడా ఒకటి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com