ఆసిస్‌పై టీమిండియా గెలుపు ఓ అద్భుతం : పవన్
- IndiaGlitz, [Tuesday,January 19 2021]
బ్రిజ్బేన్ టెస్ట్‌లో భారత్ చరిత్రాత్మక విజయం సాధించిన విషయం విదితమే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన నాలుగో టెస్టులో భారత్ తిరుగులేని విజయాన్ని సాధించి.. గబ్బా పిచ్‌లో ఓటమంటే ఎరుగని కంగారూలకు టీమిండియా తమ సత్తా ఏంటో చూపించింది. ఈ క్రమంలో టీమిండియాకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకుని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు పార్టీల అధిపతులు, మాజీ క్రికెటర్లు సైతం అభినందించారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్రకటనను విడుదల చేశారు.
ప్రశంసనీయం..
‘భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాపై ఆ దేశంలోనే టెస్ట్ సిరీస్ సాధించడం చారిత్రాత్మకం. బ్రిస్బేన్ మైదానంలోని టెస్టులో గెలిచిన తీరు ఓ అద్భుతం. ఈ ఘనత సాధించిన మన క్రికెట్ జట్టుకు నా తరఫున, జనసేన తరఫున అభినందనలు తెలియచేస్తున్నాను. ప్రతికూల పరిస్థితుల్లో సాధించిన ఈ విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. కీలక ఆటగాళ్లు గాయాల పాలైనా... అంతర్జాతీయ వేదికలపై తొలి అడుగులు వేస్తున్న క్రీడాకారులు చూపిన ప్రతిభ, కలసికట్టుగా విజయం కోసం పోరాడిన విధానం ప్రశంసనీయం’ అని పవన్ ప్రకటనలో పేర్కొన్నారు.
ఆస్ట్రేలియాపై టెస్ట్ సిరీస్ గెలుపు ఓ అద్భుతం - JanaSena Chief Sri @PawanKalyan #AUSvIND#INDvsAUS#TeamIndia pic.twitter.com/asajnh1hgp
— JanaSena Party (@JanaSenaParty) January 19, 2021