Jr NTR : టీమిండియా క్రికెటర్లతో జూనియర్ ఎన్టీఆర్.. ఫోటోలు వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఫుల్ జోష్‌లో వున్నారు. ఇప్పటికే గతేడాది ఆర్ఆర్ఆర్ భారీ బ్లాక్ బస్టర్ సాధించడంతో ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లారు తారక్. న్యూఇయర్‌ను అక్కడే జరుపుకున్న ఆయన బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి తోడు .. ఆర్ఆర్ఆర్ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డులను పొందుతూ వుండటంతో జూనియర్‌కు మంచి కిక్ ఇస్తోంది. రాజమౌళి, కీరవాణి, రామ్‌చరణ్ కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ సందడి చేశారు. ఇటీవలే భారతదేశానికి తిరిగి వచ్చిన జూనియర్ త్వరలోనే షూటింగ్ యాక్టివిటీస్‌లో పాల్గొననున్నారు.
జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసిన టీమిండియా క్రికెటర్లు:
ఇదిలావుండగా.. ఎన్టీఆర్ టీమిండియా క్రికెటర్లతో దిగిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో తారక్‌తోపాటు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్, యుజ్వేంద్ర చాహల్, శార్దూల్, శుభమాన్ గిల్‌తో పాటు పలువురు వున్నారు.అయితే ఈ ఫోటో ఎప్పుడు, ఎక్కడ దిగారన్నది మాత్రం తెలియరాలేదు. వెనుక బ్యాక్‌గ్రౌండ్ చూస్తే మాత్రం ఓ లగ్జరీ కార్ల షోరూంలా కనిపిస్తోంది.
ఉప్పల్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ తొలి వన్డే:
ఇకపోతే.. ప్రస్తుతం శ్రీలంకతో వన్డే సిరీస్ నెగ్గిన భారత్ త్వరలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లలో తలపడనుంది. దీనిలో భాగంగా తొలుత వన్డే సిరీస్ జరగనుంది. తొలి వన్డే హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జనవరి 18న జరగనుంది. దీంతో భారత జట్టు ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని ప్రాక్టీస్ మొదలెట్టింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు సంబంధించి టికెట్లు విక్రయించేందుకు ఏర్పాట్లు చేసింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియాలతో పాటు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఆఫ్‌లైన్‌లో టికెట్లు తీసుకునేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేయనున్న కొరటాల శివ,ప్రశాంత్ నీల్ :
జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. తన 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఎప్పుడో మొదలైపోయాయి.అలాగే కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన 31వ సినిమాకు యంగ్ టైగర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com