మధుమిత ఓ ఛానల్ లైవ్‌లో ఉండగా.. షాకింగ్ విషయం చెప్పిన టీచర్..

  • IndiaGlitz, [Monday,September 21 2020]

ఆన్‌లైన్ క్లాసుల పేరిట ప్రైవేటు పాఠశాలలు భారీగా ఫీజులు వసూలు చేయడంపై ఇటీవల నటుడు శివబాలాజీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన విషయం తెలిసిందే. అంతటితో ఆయన ఆగక స్కూలు యాజమాన్యంపై మానవ హక్కుల సంఘానికి సైతం ఫిర్యాదు చేశారు. శివబాలాజీ పిల్లలు హైదరాబాద్ మణికొండలోని మౌంట్‌ లిటేరా జీ స్కూల్‌లో చదువుతున్నారు. అయితే శివబాలాజీ ఆ స్కూలు ఫీజుల విషయాన్ని హెచ్‌ఆర్సీ వరకూ తీసుకెళ్లడంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై కొన్ని మీడియా సంస్థలు చర్చ నిర్వహించాయి. ఈ చర్చలో తాజాగా శివబాలాజీ భార్య మధుమిత పాల్గొన్నారు.

అయితే మధుమిత చర్చలో ఉండగానే మౌంట్‌ లిటేరా జీ స్కూల్‌లో ఏడాది పాటు పని చేసిన ఓ టీచర్ లైవ్‌లో స్కూలు గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఆ స్కూలులో తాను ఏడాది పాటు పని చేశానని.. ఆ సమయంలోనే తనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందని.. అయితే ఈ టైమ్‌లో నీకెందుకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందని ప్రశ్నించారని చెప్పారు. టీచర్ చెప్పిన విషయాన్ని విన్న మధుమిత లైవ్‌లోనే ఎమోషనల్ అయ్యారు. స్కూలు యాజమాన్యంపై ఆమె ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా స్కూలు యాజమాన్యం గురించి మధుమిత పలు సంచలన విషయాలు వెల్లడించింది.

More News

దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది: పాయల్‌పై అనురాగ్ కశ్యప్ ఫైర్

హీరోయిన్ పాయల్ ఘోష్.. దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై చేసిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

చైనా నిఘా వర్గాలకు కీలక సమాచారం చేరవేత.. జర్నలిస్ట్ అరెస్ట్..

ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రాజీవ్ శర్మను ఢిల్లీ ప్రత్యేక పోలీసులు అరెస్ట్ చేశారు.

ఏ రాత్రి అందంగా  ముగుస్తుందో అదే గ్రేట్‌ డే:  పూరీ జగన్నాథ్‌

పూరి మ్యూజింగ్స్‌ పేరుతో డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ ..కొన్ని రోజులుగా కొన్ని అంశాలపై మాట్లాడుతున్నారు.

'బోగ‌న్‌' ఈ నెల 26 న ట్రైలర్ విడుదల

త‌మిళంలో అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రిగా రాణిస్తున్న 'జ‌యం' ర‌వి తెలుగు ప్రేక్ష‌కుల‌కూ సుప‌రిచితుడే.

మతం మార్చుకున్న నటి సంజనా.. తీవ్ర స్థాయిలో రూమర్స్..

బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయిన శ్యాండిల్ వుడ్ బ్యూటి, బహుబాష నటి సంజనా గల్రాని ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారుతోంది.