మధుమిత ఓ ఛానల్ లైవ్‌లో ఉండగా.. షాకింగ్ విషయం చెప్పిన టీచర్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఆన్లైన్ క్లాసుల పేరిట ప్రైవేటు పాఠశాలలు భారీగా ఫీజులు వసూలు చేయడంపై ఇటీవల నటుడు శివబాలాజీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన విషయం తెలిసిందే. అంతటితో ఆయన ఆగక స్కూలు యాజమాన్యంపై మానవ హక్కుల సంఘానికి సైతం ఫిర్యాదు చేశారు. శివబాలాజీ పిల్లలు హైదరాబాద్ మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్లో చదువుతున్నారు. అయితే శివబాలాజీ ఆ స్కూలు ఫీజుల విషయాన్ని హెచ్ఆర్సీ వరకూ తీసుకెళ్లడంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై కొన్ని మీడియా సంస్థలు చర్చ నిర్వహించాయి. ఈ చర్చలో తాజాగా శివబాలాజీ భార్య మధుమిత పాల్గొన్నారు.
అయితే మధుమిత చర్చలో ఉండగానే మౌంట్ లిటేరా జీ స్కూల్లో ఏడాది పాటు పని చేసిన ఓ టీచర్ లైవ్‌లో స్కూలు గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఆ స్కూలులో తాను ఏడాది పాటు పని చేశానని.. ఆ సమయంలోనే తనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందని.. అయితే ఈ టైమ్‌లో నీకెందుకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందని ప్రశ్నించారని చెప్పారు. టీచర్ చెప్పిన విషయాన్ని విన్న మధుమిత లైవ్‌లోనే ఎమోషనల్ అయ్యారు. స్కూలు యాజమాన్యంపై ఆమె ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా స్కూలు యాజమాన్యం గురించి మధుమిత పలు సంచలన విషయాలు వెల్లడించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com