టీడీపీ టార్గెట్ జగన్ కాదు.. ఆ ఆరుగురే!?
Send us your feedback to audioarticles@vaarta.com
టైటిల్ చూడగానే ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే పులివెందులలో ఎలాగో గెలిచేది లేదు.. అది అస్సలు సాధ్యం అని భావించిన సీఎం చంద్రబాబు ఆ ఆరుగురి పైనే ప్రత్యేక దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు ‘ఆపరేషన్ గరుడ’, ‘ఆపరేషన్ వడ’.. ఆ ఆరుగురి కోసం ‘ఆపరేషన్ సిక్స్’ను చంద్రబాబు అప్పుడే మొదలెట్టేశారట. ఒకప్పుడు టీడీపీని అటు బయట, అసెంబ్లీలో ఇబ్బంది పెట్టిన ఆ ఆరుగురిపైనే సీఎం ప్రత్యేక దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ ఆరుగురు ఎవరు..? ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చిందనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఆ ఆరుగురు వీళ్లే...
వైఎస్ ఫ్యామిలీ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ జెండా ఆ తర్వాత వైసీపీ జెండానే ఎగురుతోంది. ఇంత వరకూ టీడీపీ జెండా దాఖలాల్లేవ్.. బహుశా మున్ముంథు జెండా ఎగరేసే అవకాశాలు కూడా అస్సలే లేవు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్షల్లో మెజార్టీ వస్తుండటమే దీనికి కారణం. దీంతో జగన్‌ను టార్గెట్‌గా పెట్టుకోవడం వల్ల ప్రయోజనమేమీ లేదని భావించిన టీడీపీ.. వైసీపీలో కీలకంగా ఫైర్‌బ్రాండ్‌గా, టీడీపీని ఏడిపించి ఏడు చెరువులు నీళ్లు తాపిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. ప్రస్తుతం ఈ ఆరుగురే చంద్రబాబు భారీ టార్గెట్‌గా భావిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరికోసం కాకలు తీరిన నేతలను బరిలోకి దింపడానికి చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారట.
చిత్తూరు విషయానికొస్తే...
నగరి, గుడివాడ నియోజకవర్గాల్లో ఆ సిట్టింగ్‌లపై.. రానున్న ఎన్నికల్లో ఎంత వెతికినా సరైన అభ్యర్థి దొరకలేదట. అంతేకాదు చాలా వరకు టీడీపీ తరఫున పోటీ చేయడానికి నేతలు జంకుతున్నారట. చిత్తూరు జిల్లా విషయానికొస్తే.. చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అయిన చెవిరెడ్డిని ఓడించడానికి ఈసారి ధీటైన అభ్యర్థిని బరిలోకి దింపాలని కొడితే చంద్రగిరి కోట పసుపు జెండా ఎగరాలని టీడీపీ భావిస్తోందట. నగరిలో రోజాకు ధీటైన ప్రత్యర్థి అయిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు మరణం తర్వాత సరైన అభ్యర్థి టీడీపీకి దొరకట్లేదట. అందుకే ఈ రెండు నియోజకవర్గాలపై మంత్రి నారా లోకేశ్ బాబు ప్రత్యేకంగా దృష్టిసారించారట.
నెల్లూరు జిల్లా విషయానికొస్తే..
నెల్లూరు సిటీలో వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ను ఢీకొనే మొనగాడు ఎవరబ్బా అని చూస్తుండగా అదికాస్త మంత్రి నారాయణ రూపంలో దొరికారట. పరోక్షంగా చంద్రబాబు ఇచ్చిన గ్రీన్ సిగ్నల్‌లో నారాయణ తన పని తాను చేసుకుని పోతున్నారట. పైగా మంచి డబ్బున్న నేత కావడంతో నారాయణ తిరుగుండదని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు నెల్లూరు రూరల్ విషయానికొస్తే ఇక్కడ వైసీపీ తరఫున కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. సేమ్ అదే సామాజికవర్గానికి చెందిన ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఇప్పటికే అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించేశారు. ఆర్థికంగా మంచిపేరున్న ఆదాలకు నెల్లూరు జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల మీద ఆయనకు పట్టుంది దీంతో కోటంరెడ్డి సరైన అభ్యర్థి అని భావించి ఆదాలను బరిలోకి దింపిది టీడీపీ.
డోన్, గుడివాడ విషయానికొస్తే...
ఇక డోన్ విషయానికొస్తే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి .. లెక్కలు చెప్పడంలో ఆ లెక్కల్లో తప్పులు చూపడంలో ఈయనకు మించినోడు టీడీపీలోనే కాదు వైసీపీలో కూడా భూతద్ధం పెట్టి వెతికినా దొరకరు గాక దొరకరు. ఈ నియోజకవర్గం నుంచి కేఈ కుటుంబంలోని ఒకర్ని గానీ లేదా కోట్ల కుటుంబంలో నుంచి ఒకర్ని బరలోకి దింపడానికి చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారని సమాచారం. ఆ రెండు ఫ్యామీలు కలిస్తే బుగ్గనని ఈజీగా ఓడించేయచ్చుని టీడీపీ కోడై కూస్తోందట. ఇక మిగిలిందళ్లా గుడివాడ ఇప్పటికే మూడుసార్లు గెలిచిన కొడాలి నానిని ఈసారి ఓడించాలని భావిస్తున్న టీడీపీ ఇక్కడ్నుంచి దేవినేని అవినాశ్ లేదా రావి వెంకటేశ్వరరావును బరిలోకి దింపాలని భావిస్తోంది అవసరమైతే మూడో వ్యక్తి ధీటుగా బదులిచ్చే వ్యక్తిని బరిలోకి దింపాలనుకోందట టీడీపీ.
ఈ ఆరుగుర్ని గనుగ ఓడిస్తే వైసీపీని సగం ఓడించిన్లేనట. పైగా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టిన వాళ్లే ఈ ఆరుగురు కావడంతో కచ్చితంగా ఓడించి తీరాలని ఈ ‘ఆపరేషన్ ఆరుగురు’ అనే ప్రక్రియను బాబు ప్రారంభించారట. అయితే ఈ ఆపరేషన్ ఎంత వరకు వర్కటవుతుంది..? ఈ ఆరుగురు గెలుస్తారా..? తెలంగాణ ఎన్నికల్లో ఉద్దండులు ఢీలా పడినట్లుగా అట్టర్ ప్లాప్ అవుతారా..? అనే విషయం తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments