రోజురోజుకు దిగజారుతున్న టీడీపీ.. సైబర్ నేరస్థుడికి వత్తాసు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఇంతకన్నా ఏం దిగజారుతుంది అనుకున్న ప్రతిసారీ మరింత దిగజారుతుంది తెలుగుదేశం పార్టీ. విదేశాల్లో ఉంటూ సీఎం జగన్‌తో పాటు వైసీపీ నేతలు, కుటుంబసభ్యులను సోషల్‌మీడియాలో ఇష్టారీతిన విమర్శలు చేశాడు. ఉన్నతచదువులు చదువుకుని విదేశాల్లో ఉండేవారు మంచి పొజిషన్లో ఉంటారు. కానీ యాష్ అనే టీడీపీ కార్యకర్త వ్యవహరించిన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. సభ్యత సంస్కారం లేకుండా ముఖ్యమంత్రి జగన్‌తో పాటు వారి కుటుంబ సభ్యులపైనా బురద జల్లుతూ పోస్టులు పెట్టడం.. అందుకు వత్తాసు పలకడం పచ్చ బ్యాచ్‌కే చెల్లింది.
చట్టప్రకారం మాత్రమే అరెస్ట్..
అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సీఎం జగన్ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం కాదు ఇప్పుడు ఉంది. సమయం వచ్చినపుడు సరైన రీతిలో స్పందిస్తుంది. ఖండాంతరాలు దాటి వెళ్లి నాగరికత, సభ్యత సంస్కారం మర్చిపోయి. నోటికొచ్చినట్లు పోస్టులు పెడితే ఏమి చేయకుండా ఉంటారా..? ఇప్పటికే అతడిపై చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అందుకే హైదరాబాద్ రాగానే సీఐడీ అధికారులు చట్టప్రకారం అరెస్ట్ చేశారు.
కుటుంబసభ్యులనూ దూషిస్తే ఊరుకోవాలా..?
దానికి కొంచెం కూడా బుద్ధి లేకుండా అక్రమంగా అరెస్ట్ చేశారంటూ పచ్చ బ్యాచ్ తెగ గొంతు చించుకుంటున్నారు. తల్లికి ఆరోగ్యం బాలేదని ఇండియా వచ్చిన యాష్ అనే వ్యక్తికి సీఎంతో పాటు ఆయన కుటుంబసభ్యులపై ఇష్టానుసారం పోస్టులు పెట్టినపుడు గుర్తుకు రాలేదా బంధాలు, బాంధవ్యాలు. తన కుటుంబంపై అసభ్యకర కామెంట్స్ చేశారని మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చిన సంగతి జనం మర్చిపోలేదు కదా. టీడీపీ నేతల కుటుంబీకుల విషయంలో ఎవరైనా అలా పోస్టింగులు పెడితే మీరు అభినందిస్తూ దండలు వేస్తారా? అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో 23 సీట్లతో ప్రజలు ఇంట్లో కూర్చోపెట్టినా ఇంకా బుద్ధి రాలేదు. సంస్కారం లేని ఇలాంటి కార్యకర్తలకు మద్దతు తెలియజేస్తే ఈసారి శాశ్వతంగా ఇంట్లోనే కూర్చుపెట్టే పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments