Sajjala: చంద్రబాబు ప్రాణాలకు ముప్పు అంటూ టీడీపీ డ్రామాకు తెరలేపింది: సజ్జల

  • IndiaGlitz, [Friday,October 13 2023]

టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం విషమించిందంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం ఉందంటూ నిన్నటి నుంచి కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు. జైలు ఏమైనా అత్తగారిల్లా, ఏసీ పెట్టడానికి ఎద్దేవా చేశారు. మిగిలిన ఖైదీలకు లేని హక్కు చంద్రబాబుకే ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. స్కిన్ ఎలర్జీకే ప్రాణాలకే ముప్పు అన్నట్లు హడావిడి చేస్తున్నారని సజ్జల పేర్కొన్నారు. 24 గంటలూ జైలు వైద్యులు చంద్రబాబు ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని చెప్పుకొచ్చారు. తప్పు చేశారు కాబట్టే చంద్రబాబు జైలుకు వెళ్లారని వివరించారు.

చంద్రబాబుకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించాం..

జైలులో చంద్రబాబుకు ఉన్నంతలో అత్యుత్తమ సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. అసలు, బ్యారక్ మొత్తం ఖాళీ చేయాల్సిన అవసరం ఏముంది? స్నేహా బ్యారక్ ను పూర్తిగా చంద్రబాబు కోసమే కేటాయించారని తెలిపారు. ఆయనకు ఇంటి భోజనమే అందిస్తున్నారు కదా... మరి ఇంటి సభ్యులు అందించే భోజనమే తింటున్నప్పుడు చంద్రబాబు బరువు ఎందుకు తగ్గుతారు? మరి మీరేం భోజనం పెడుతున్నారో అని ప్రశ్నించారు. అర్జెంటుగా చంద్రబాబును బయటికి తీసుకురావాలనే తాపత్రయం వారిలో కనపడుతుందన్నారు. బయట ఆసుపత్రిలో చేర్చి ఆ తర్వాత ఈ రాష్ట్రంలో మాకు భద్రత లేదు అని చెప్పి హైదరాబాద్ వెళ్తారని ఆయన ఆరోపించారు.

లోకేశ్ డ్రామాలు చూసి దిమ్మతిరిగి పోయింది..

బీజేపీ నేతల వద్దకు బంధువులను పంపించి బయటకు రావడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సజ్జల విమర్శించారు. నారా లోకేశ్‌ ఢిల్లీలో డ్రామాలు చేశారని మండిపడ్డారు. అమిత్‌ షాతో లోపల మాట్లాడింది ఒకటైతే, బయటకు వచ్చి చెప్పిన విషయాలు చూస్తే దిమ్మతిరిగి పోయిందన్నారు. లోకేశ్‌తో మాట్లాడాలని అమిత్ షానే ఓ మెసేజ్ పంపించారని.. సీఎం జగన్ గురించి, ఇక్కడి పరిణామాల గురించి అమిత్ షా ఏదో చెప్పినట్లు బిల్డప్పులు ఇచ్చారని సెటైర్లు వేశారు.

More News

Chandrababu:సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్లు మంగళవారానికి వాయిదా

సుప్రీంకోర్టులో టీడీపీ ఛీఫ్ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌, ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది.

SRK, Prabhas:ప్రభాస్‌తో పోటీకి వెనక్కి తగ్గిన షారుఖ్.. 'డంకీ' విడుదల తేదీ వాయిదా..!

బాలీవుడ్ బాద్‌ షా షారుఖ్ ఖాన్ (ShahRukhKhan) ఈ ఏడాది రెండు బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇచ్చి మాంఛి ఊపు మీద ఉన్నాడు.

Ponnala Lakshmaiah:కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా

ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేశారు.

Chandrababu:చంద్రబాబుకు ఆరోగ్య సమస్యల పేరిట కొత్త డ్రామాకు తెరదీసిన టీడీపీ

స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలు డ్రామాలకు దిగారు.

Maruti Kiran:రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది.. టికెట్లు అమ్ముకుంటున్నారు: మారుతి కిరణ్

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందని బీజేపీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ బూనేటి ఎద్దేవా చేశారు.