Chandrababu Naidu:నన్ను అడ్డుకుంటే జరిగేది ఇదే : పోలీసులు, వైసీపీ కేడర్‌పై దాడికి చంద్రబాబు ఆదేశాలు.. రెచ్చిపోయన తెలుగు తమ్ముళ్లు

  • IndiaGlitz, [Friday,August 04 2023]

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలోని అంగళ్లు పర్యటనలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను అడ్డుకోవడానికి వచ్చిన వైసీపీ కార్యకర్తలు, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కేడర్, పోలీసులను వదలొద్దు దాడి చేసి తరిమి కొట్టాలంటూ చంద్రబాబు కార్యకర్తలను రెచ్చగొట్టారు. మీరు కర్రలతో వస్తే నేనూ కర్రలతో వస్తా.. మీరు యుద్ధం ప్రకటిస్తే నేను యుద్ధం ప్రకటిస్తానంటూ పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాదు.. డీఎస్పీ స్థాయి అధికారిని ఏయ్ నీ యూనిఫాం తీసేయ్ అంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఏయ్ పోలీస్ బట్టలిప్పు :

టైం చెప్పండి, ప్లేస్ చెప్పండి.. ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ సవాల్ విసిరారు. తాను కూడా చిత్తూరు జిల్లాలోనే పుట్టాలనని.. బాంబులకే భయపడలేదు, రాళ్లకు భయపడతానా అంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను బెదిరించడం, మిమ్మల్ని పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదు అంటూ హెచ్చరించారు. రౌడీలకు రౌడీగా వుంటా.. ఏయ్ పోలీస్ వాళ్లను పంపించూ అంటూ ఫైర్ అయ్యారు. అందరూ పెయిడ్ ఆర్టిస్టులేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అడ్డుకుంటే ఇలాగే జరుగుతుందని, దెబ్బలు తగిలినా, తలలు పగిలినా భయపడేది లేదని, మగాళ్లైతే పోలీసులు లేకుండా రండి తేల్చుకుందాం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏయ్ పోలీస్ బట్టలిప్పూ.. రోషం లేని జీవితం నాశనం, నీ పతనం చూసేవరకు వెంటపడతానంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చంద్రబాబు ఆదేశాలతో పచ్చబ్యాచ్ వీరంగం :

చంద్రబాబు ఆదేశాలతో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు విధ్వంసం సృష్టించారు. రాళ్లు, బీర్ బాటిళ్లతో పోలీసులు, వైసీపీ కేడర్‌పై దాడికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు ఎస్సైలు, పది మంది కానిస్టేబుళ్లకు గాయాలు అయ్యాయి. రెండు పోలీసులు వాహనాలకు సైతం నిప్పు పెట్టగా, పలువురు వైసీపీ నేతలకు సైతం గాయాలయ్యాయి. ఘటన నేపథ్యంలో అదనపు బలగాలు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.

More News

Rahul Gandhi:'మోడీ ఇంటి పేరు కేసు'.. రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ , శిక్షపై స్టే విధించిన సుప్రీంకోర్ట్

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసులో రాహుల్‌ను దోషిగా తేలుస్తూ,

Ponguru Priya:నారాయణ నుంచి నాకు ప్రాణహానీ .. వాళ్లే చంపేసి , నేనే చేసుకున్నానని చెబుతారేమో : ప్రియా పొంగూరి

మాజీ మంత్రి , టీడీపీ నేత పొంగూరు నారాయణపై ఆయన మరదలు ప్రియా పొంగూరు తన ఆరోపణలను తీవ్రతరం చేశారు.

Naga Chaitanya :సిక్కోలు జిల్లాలో మారుమూల గ్రామానికి నాగచైతన్య .. మత్స్యకారులతో ముచ్చట్లు, ఏం జరుగుతోంది..?

అక్కినేని నాగచైతన్య.. ఏఎన్ఆర్ వంశం నుంచి తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టిన మూడో తరం హీరో. తండ్రి, తాతల నుంచి నట వారసత్వం పుణికిపుచ్చుకున్న చైతూ వారిద్దరి బాటలోనే

Sruthi Shanmugha:బుల్లితెర నటి శృతి షణ్ముగ ప్రియ భర్త హఠాన్మరణం.. ఏడాది క్రితం పెళ్లి, అంతలోనే ఇలా

ప్రముఖ బుల్లితెర నటి శృతి షణ్ముగ ప్రియ భర్త అరవింద్ శేఖర్ హఠాన్మరణం పాలయ్యారు. కొన్నేళ్లు డేటింగ్‌లో వీరు గతేడాది మేలో పెళ్లి చేసుకున్నారు.

Rayapati Sambasivarao:బయటపడ్డ రాయపాటి అక్రమాల చిట్టా.. బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం, ఇండియాలోనే పెద్ద లోన్ స్కామ్ అట

టీడీపీ నేతలు తెల్లారి లేస్తే.. సీఎం వైఎస్ జగన్‌ను విమర్శిస్తారన్నది తెలిసిందే. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ లక్ష కోట్లు పోగేశారని,