కోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు.. హౌస్ కస్టడీ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం

  • IndiaGlitz, [Tuesday,September 12 2023]

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. తన రిమాండ్‌ను హౌస్ కస్టడీగా మార్చాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. జైలులో చంద్రబాబుకు భారీ భద్రత వుందన్న సీఐడీ తరపు న్యాయవాదుల వాదనతో కోర్ట్ ఏకీభవించింది. దీంతో సోమవారం ఉదయం నుంచి నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.

సోమవారం ముగిసిన వాదనలు :

నిన్న ఈ పిటిషన్‌పై చంద్రబాబు తరపున సుప్రీంకోర్ట్ సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా, ఏపీ సీఐడీ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపంచారు. చంద్రబాబుకు జైల్లో ప్రాణహాని వుందని, ఆయనను హౌస్ రిమాండ్‌కు అనుమతించాలని లూథ్రా వాదించారు. దీనిపై సీఐడీ తరపున పొన్నవోలు తప్పుబట్టారు. సెక్షన్ 167(2) కింద రెండు కస్టడీలు మాత్రమే వుంటాయని.. జ్యూడిషియల్ , పోలీస్ కస్టడీలు వుంటాయని కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో నవలఖా తీర్పును పరిగణనలోనికి తీసుకోవాలని సిద్ధార్థ్ లూథ్రా వాదించారు. అయితే నవలఖా తీర్పునకు, ప్రస్తుత కేసుకు సంబంధం లేదని సుధాకర్ రెడ్డి వాదించారు. కొన్నాళ్లు జైలులో వుండి.. ఆరోగ్య కారణాలతో మాత్రమే హౌస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతిస్తుందని చెప్పారు. సీఆర్‌పీసీ చట్టంలో హౌస్ ప్రొటెక్షన్ అనేది ఎక్కడా లేదని, చంద్రబాబుకు జైలులో భారీ భద్రత కల్పించామని, 24 గంటలూ వైద్యులు అందుబాటులో వున్నారని పొన్నవోలు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

నాలుగు కేసుల్లో చంద్రబాబు లాయర్ల బెయిల్ పిటిషన్ :

ఇకపోతే.. చంద్రబాబుపై నమోదైన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, పుంగనూరు, అంగళ్లు అల్లర్లు, స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం , విజయనగరంలోని కేసులకు సంబంధించి నాలుగు బెయిల్ పిటిషన్లను హైకోర్టులో ఆయన తరపున న్యాయవాదులు దాఖలు చేశారు. ఈ కేసులపై హైకోర్టులో వాదనలు వినిపించనున్నారు.

More News

ఆయన 16 నెలలు వుండొచ్చాడని.. చంద్రబాబును 16 రోజులైనా జైల్లో పెట్టాలని : జగన్‌పై బాలయ్య చురకలు

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, రిమాండ్‌పై స్పందించారు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.

జీ తెలుగు కొత్త సీరియల్స్ నిండు నూరేళ్ల సావాసం, జగద్దాత్రికి తిరుగులేని ఆదరణ.. టాప్ లేపుతోన్న టీఆర్పీ

తెలుగువారికి అసలైన వినోదాన్ని అందిస్తూ దూసుకెళ్తోంది. మహిళామణులు మెచ్చే త్రినయని, ప్రేమ ఎంత మధురం, పడమటి సంధ్యా రాగం సీరియల్స్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

Bigg Boss 7 Telugu : శివాజీ, ప్రశాంత్‌లను ఆడుకున్న ఇంటి సభ్యులు.. అమర్‌దీప్ ఉగ్రరూపం, దెబ్బకు దారికొచ్చారుగా

బిగ్‌బాస్ 7 తెలుగులో తొలి ఎలిమినేషన్ జరిగిన సంగతి తెలిసిందే. కిరణ్ రాథోడ్‌ను గత వారం ఎలిమినేట్ చేశారు.

Chandrababu Naidu:చంద్రబాబుకు రిమాండ్ , పెత్తందార్లపై పేదల విజయం.. కోర్ట్ ముందు తలవంచిన మోసగాళ్లు

నూరు గుడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలినట్లు.. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో తనను ఎవరూ టచ్ చేయలేరని విర్రవీగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు

Former IAS PV Ramesh:చంద్రబాబు అరెస్ట్.. మాజీ ఐఏఎస్ పీవీ రమేశ్ సంచలన వ్యాఖ్యలు, సీఐడీపై ప్రశ్నల వర్షం

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం, చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం జాతీయ స్థాయిలో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.