‘ఫలితాల తర్వాత తెలుగుదేశం ప్యాకప్..!’

  • IndiaGlitz, [Monday,May 13 2019]

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు మే-23న వెలువడనున్నసంగతి తెలిసిందే. అయితే ఫలితాలకు ముందే అటు టీడీపీ.. ఇటు వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ తరుణంలో టీడీపీ-వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒక్కోసారి వీరి మాటల తూటాలకు పార్టీల అధిపతులే నోరెత్తలేని పరిస్థితి నెలకొంటోంది. తాజాగా వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం పార్టీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ఫలితాల అనంతరం తెలుగుదేశం ప్యాకప్‌ అయిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. టీడీపీ పార్టీని బతికించుకోవడానికి దేశ రాజకీయాల్లో బ్రహ్మండమైన పాత్ర పోషిస్తున్నానని చంద్రబాబు తనకు తానుగా ఇమేజ్‌ సృష్టించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని తమ్మినేని దుయ్యబట్టారు.

దమ్ము,ధైర్యం ఉందా..?

ఫలితాలు రాకుండానే జాతీయ నేతనని చంద్రబాబు ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉంది. అమరావతిలో సమీక్ష సమావేశాలు ఎన్నికల తర్వాత ప్రారంభించారని మండిపడ్డారు. చంద్రబాబుకు ఓటమి భయం కళ్ల ఎదుట కనబడుతోంది. టీడీపీలో ఉన్న సీనియర్లకు సైతం తెలుసు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటే రేపు పార్లమెంటు స్థానాల్లో ఎన్ని గెలవబోతున్నావో సమాధానం చెప్పాలి. ఫలితాల వెలువడక ముందే రాష్ట్రాలు తిరిగి చంద్రబాబు స్వయంగా జాతీయ నాయకుడిగా ఎందుకు ప్రకటించుకుంటున్నారో అర్థం కావట్లేదు. రాహుల్‌గాంధీతో చంద్రబాబు ఎప్పడయితే చేతులు కలిపారో ఆనాడే ఎన్టీఆర్‌ స్ఫూర్తిని పాతిపెట్టేశారు. తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవంగా చెప్పుకునే దమ్ము,ధైర్యం ఉందా..?. కాంగ్రెస్‌కు పార్టీకి వ్యతిరేకంగా ఉద్భవించిన తెలుగుదేశంపార్టీ.. భారతదేశ రాజకీయాల్లో చరిత్ర హీనంగా మిగిలిపోయింది అని తమ్మినేని చెప్పుకొచ్చారు.

జగన్‌ది చారిత్రాత్మక విజయం..!

రాబోయే ఎన్నికల ఫలితాలతో చంద్రబాబు పాలనకు కాలం చెల్లిపోతుంది. ఎన్నికల అనంతరం టీడీపీ బతికిబట్ట కట్టే పరిస్థితి లేదు. చంద్రబాబు ఇంకా ప్రజలను, టీడీపీ కార్యకర్తలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు.. చారిత్రాత్మక విజయాన్ని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కట్టబెట్టబోతున్నారు. అసెంబ్లీ స్థానాల్లోనే కాదు.. పార్లమెంటు స్థానాల్లో కూడా వైసీపీ విజయ దుందుంబి మోగించబోతోంది అని తమ్మినేని సీతారం జోస్యం చెప్పారు. మే-23న ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో.. ఏ పార్టీ ప్రతిపక్షంగా ఉంటుందో తేలిపోనుంది.

More News

కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 సెప్టెంబర్ తో 90శాతం పూర్తి

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన `కేజీఎఫ్ చాప్టర్- 1` సంచలనాల గురించి తెలిసిందే.

ముకేష్ అంబానీ అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నటీవీ9 రవిప్రకాష్!?

ఇదేంటి వీళ్లిద్దరూ బద్ధశత్రువులు కదా..? ఎలా దగ్గరవుతున్నారబ్బా..? అని ఆశ్చర్యపోతున్నారు కదూ..? అవును మీరు వింటున్నది సోషల్ మీడియాలో గత రెండ్రోజులుగా వస్తున్న పుకార్లు నిజమైతే

మహిళలకు గుడ్ న్యూస్.. యాంటీ ‘రేప్’ చీర‌లొచ్చేశాయ్!

భారతదేశంలో ఫ్యాషన్లకు ఏ మాత్రం కొదువలేదు.. టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో అంతకు రెట్టింపు స్థాయిలో ఫ్యాషన్ కూడా రెట్టింపు అవుతోంది.

స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ సరే.. ఒప్పుకున్నారా!?

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌తో ఢిల్లీలో చక్రం తిప్పాలని యోచిస్తున్న సంగతి తెలిసిందే.

వీహెచ్‌ వ్యవహారంలో నగేశ్‌కు షాకిచ్చిన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్)పై ఇటీవల అఖిలపక్షం ధర్నాలో పీసీసీ కార్యదర్శి నగేశ్ ముదిరాజ్ దురుసుగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.