ఓటమికి దగ్గరగా టీడీపీ.. వైసీపీదే గెలుపు..!

  • IndiaGlitz, [Wednesday,January 09 2019]

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయారని.. అందుకే ఆయన ఓటమికి దగ్గరగా ఉన్నారని.. వైసీపీ గెలవబోతోందని కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాదర్ రెడ్డి పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ.. జగన్‌ను గెలిపించేందుకు ప్రాణాన్ని కూడా లెక్క చేయమని.. చంద్రబాబు ప్రభుత్వాన్ని పూర్తిస్థాయిలో నేలమట్టం చేస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అప్పుడు కార్యకర్తను.. ఇప్పుడు ఎమ్మెల్యేగా మీ ముందున్నా..!
జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ధనం, మానం, ప్రాణాన్ని కూడా లెక్క చేయం. చంద్రబాబు నరకాసుర పాలనను అంతం చేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు సామాన్య కార్యకర్తగా ఇచ్ఛాపురం వచ్చాను. ఈ రోజు వైసీపీ శాసనసభ్యుడిగా రాచమల్లు మీ ముందు నిలబడ్డాడు. నమ్ముకున్న వారికి న్యాయం చేసే కుటుంబం వైయస్‌ఆర్‌ది. వైసీపీ ఎమ్మెల్యేలను 23 మందిని సంతలో పశువుల్లా చంద్రబాబు కొనుగోలు చేశాడు. ప్రస్తుతం వారి టికెట్లు ఉన్నాయో లేవో తెలియని పరిస్థితి అని రాచమల్లు వ్యాఖ్యానించారు.

నందిని పంది చేస్తాడేమో..!
చంద్రబాబు దగ్గర అక్రమ సంపాదన దండిగా ఉంది. ఓటుకు డబ్బులిచ్చి ఎక్కడ నందిని పందిని చేస్తాడోనని కార్యకర్తల అభిప్రాయం. అన్ని వేళల్లో.. అన్ని సందర్భాల్లో డబ్బుతో ప్రజలను కొనాలనుకోవడం అసాధ్యం. వైఎస్‌ జగన్‌ సునామీలో చంద్రబాబు కొట్టుకుపోవడం ఖాయమం. వైసీపీకి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నరకాసురుడి లాంటి పాలనను అంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు అని రాచమల్లు జోస్యం చెప్పారు.

More News

బాలయ్యపై లక్ష్మీపార్వతి షాకింగ్ కామెంట్స్!

దివంగత ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆరాధ్యుడైన ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి.. హీరో బాలకృష్ణను మెచ్చుకున్నారు.

రేవంత్‌‌ రెడ్డికి మరో కోలుకోలేని షాక్..!

తెలంగాణ ఎన్నికల్లో కలలో కూడా ఊహించని రీతిలో కొడంగల్‌‌లో ఘోరంగా ఓటమిని చవిచూసిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వరుస షాక్‌లు వెంటాడుతున్నాయి.

వైఎస్ జగన్ పాదయాత్ర సక్సెస్‌‌కు కారణమిదే..

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజా సంకల్ప యాత్ర' నేటితో శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో ముగియనుంది.

న్యాయం చేశాననుకుంటున్న బాలీవుడ్ సొగ‌స‌రి

గత ఏడాది 'వీడెవడు' చిత్రంలో నటించిన ఈషాగుప్తా ఈ ఏడాది 'వినయవిధేయరామ' చిత్రంతో పలకరించనుంది.

మళ్లీ బిగ్‌బాస్‌లోకి యంగ్ టైగ‌ర్‌

హిందీ నుండి తెలుగులోకి వచ్చిన రియాలిటీ షో బిగ్‌బాస్‌. ఇందులో తొలి సీజన్‌ను ఎన్టీర్‌ హోస్ట్‌ చేయగా రెండో సీజన్‌ను నాని హోస్ట్‌ చేశారు.