నారా లోకేష్ లేటెస్ట్ పిక్ వైరల్.. క్రేజీ లుక్ లో టీడీపి యంగ్ బాస్!
Send us your feedback to audioarticles@vaarta.com
మాజీ సీఎం చంద్రబాబు తనయుడు, టిడిపి యువ నేత నారా లోకేష్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. టిడిపికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు లోకేష్ తన వంతు కృషి చేస్తున్నారు. వీలు చిక్కినప్పుడు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ కార్యకర్తలని కలుసుకుంటున్నారు.
కానీ లోకేష్ పై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుండడం చూస్తూనే ఉన్నాం. తన ప్రసంగాల్లో లోకేష్ ఇంకా పరిణితి ప్రదర్శించాలని వాదన విపిస్తోంది. ఎవరికైనా ప్రసంగాల్లో తప్పులు దొర్లడం సహజమే. కానీ లోకేష్ ఆ విషయంలో కాస్త ఎక్కువ తప్పులు చేస్తుండడంతో ట్రోలింగ్ జరుగుతోంది.
టిడిపిని నడిపించగలిగే అసలైన వారసుడిని తానే అని నిరూపించుకునేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నాడు. 2019 పరాజయం తర్వాత టిడిపి పరిస్థితి దారుణంగా మారింది. ఈ క్రమంలో కార్యకర్తలకి భరోసా ఇవ్వడంతో పాటు.. తాను పార్టీని నడిపించగలననే నమ్మకాన్ని టిడిపి నేతలకు లోకేష్ ఇవ్వాలి.
దీనికోసం అన్ని ప్రయత్నాల్ని లోకేష్ చేస్తున్నారు. తన యాటిట్యూడ్ తో పాటు మేకోవర్ ని కూడా మార్చొవాలని డిసైడ్ అయ్యాడో ఏమో కానీ.. లోకేష్ కొత్త లుక్ లోకి మారిపోతున్నాడు. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా లోకేష్ గడ్డం పెంచుతున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టిడిపి అభిమానులని లోకేష్ లేటెస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. లోకేష్ కొత్త లుక్ పై అభిమానులు తమకు తోచిన విధంగా కామెంట్స్ పెడుతున్నారు.
చంద్రబాబు రాజకీయాల్లో అపర చాణిక్యుడిగా గుర్తింపు పొందారు. ఆ స్థాయిలో లోకేష్ గుర్తింపు పొందాలంటే ఇంకా బాగా కష్టపడక తప్పదు. టిడిపి గతంలో అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన లోకేష్ ఓటమి చెందారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com