రాజీనామా చేసి వైసీపీలో చేరిన టీడీపీ ఎంపీ

  • IndiaGlitz, [Monday,February 18 2019]

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు వరుస షాక్‌‌లు తగులుతున్నాయి. ఒక్క రోజు గ్యాప్‌‌లోనే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వీడుతుండటంతో అసలేం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. ఒక ఎంపీ వైసీపీ, పలువురు కీలకనేతలు కండువా కప్పకోగా తాజాగా.. టీడీపీకి చెందిన అమలాపురం ఎంపీ రవీంద్రబాబు వైసీపీలో చేరారు. టీడీపీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం లోటస్‌‌పాండ్‌‌కు వెళ్లిన రవీంద్రబాబు వైఎస్‌‌ జగన్‌ మోహన్‌‌రెడ్డితో భేటీ అయ్యారు. 

మధ్యాహ్నం 12 గంటల నుంచి అరగంట పాటు పలు విషయాలపై చర్చించారు. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో ఎక్కడ్నుంచి పోటీ చేయాలి..? ఎంపీగా పోటీ చేయాలా..? ఎమ్మెల్యేగా పోటీ చేయాలా..? ఇలా అన్ని విషయాలు మాట్లాడిన అనంరతం జగన్‌‌ నుంచి స్పష్టమైన హామీ వచ్చిన అనంతరం అమలాపురం ఎంపీ వైసీపీ చేరాలని రవీంద్ర నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌‌.. అమలాపురం ఎంపీకి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 

చంద్రబాబు పారిపోయారు.. జగన్ 'మగధీరుడు'

ప్రత్యేక హోదా సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైక ‘మగధీరుడు’ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. పార్లమెంట్‌లో అనర్గళంగా మాట్లాడేవాడిని, రైల్వే లైన్, రూ. 100 కోట్ల నిధులు సాధించి పనులు చేయించినా దళితుడిననే ఒకే ఒక్క కారణంతో నా పేరు కూడా పేపర్లలో రాయకుండా చేశారు. తెలుగుదేశం పార్టీలో కులతత్వం పెరిగిపోయింది.

కులాలవారీగా చంద్రబాబు దగ్గర ఆర్మీలు ఉన్నాయి. ఏ కులం వారు మాట్లాడితే ఆ కులంవారితో తిట్టిస్తారు. ఒక్క సామాజిక వర్గానికే చంద్రబాబు న్యాయం చేస్తారు. రాష్ట్రం బాగుపడడం కోసం, ప్రత్యేక హోదా సాధన కోసం, దళితుల సంక్షేమం వైయస్‌ జగన్‌ వల్లే సాధ్యమని నమ్మి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాను. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబు.. హైదరాబాద్ నుంచి విజయవాడకు పారిపోయి వచ్చారు.

చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీ రాలేదని.. హోదా ఉద్యమాన్ని ఆయనే నీరుగార్చారు. బీజేపీతో నాలుగేళ్లు అంటకాగిన చంద్రబాబు.. ఇప్పుడు అదే పార్టీని తిడుతున్నారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌తో కలవడం సిగ్గుచేటు. వైసీపీలో చేరితే తన సొంత ఇంటికి వచ్చినట్లు ఉందిఅని అమలాపురం ఎంపీ చెప్పుకొచ్చారు. 

వైసీపీలో చేరిన గిద్దలూరు నేతలు

ఇదిలా ఉంటే.. గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గిద్దలూరు సమన్వయ కర్త అన్నా రాంబాబు సోమవారం ఉదయం స్థానిక నేతలైన ఎంపీపీ వంశీధర్‌రెడ్డి, అర్ధవీడు ఎంపీపీ రవికుమార్, జెడ్పీటీసీ వెంకటలక్ష్మి, ఎంపీటీసీ రామకృష్ణారెడ్డి, సింగిల్‌ విండో సొసైటీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఎదురు శ్రీనివాస్‌రెడ్డి, ఉడుముల సుధాకర్‌రెడ్డి, రంగారెడ్డి, మరో 40 మంది నాయకులతో పాటు పలువురు నేతలను తన వెంటబెట్టుకుని వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ మేరకు వారికి వైఎస్‌ జగన్‌ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

More News

వీర జవాన్ల కుటుంబాలకు 'మా' వంతు సాయం

పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు భారతదేశంలోని పలువురు ప్రముఖలు, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు, పౌరులు, హీరోలు పెద్ద మనసుతో తమవంతుగా విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.

హీరో గోపిచంద్‌‌కు రోడ్డు ప్రమాదం

హీరో గోపిచంద్ మరోసారి షూటింగ్‌‌లో గాయపడ్డారు. తిరు దర్శకత్వంలో అనిల్ సుంకర్ నిర్మిస్తొన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం ప్రస్తుతం జైపూర్ (రాజస్థాన్) దగ్గర మాండవలో చిత్రీకరణ జరుపుకుంటోంది.

కేసీఆర్ కేబినెట్‌‌ నుంచి హరీశ్, కేటీఆర్, ఈటెల ఔట్!

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు పూర్తవుతున్నా ఇంత వరకూ కేబినెట్ ఏర్పాటు చేయాలేదే అపవాదును సీఎం కేసీఆర్ తుడుపుకుంటూ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

వైసీపీలోకి మరో సిట్టింగ్ ఎంపీ

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌‌లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు ‘బ్యాడ్ టైమ్’ స్టార్ట్ అయ్యిందని స్పష్టంగా అర్థమవుతోంది!.

పాక్ క‌ళాకారుల‌ను బ్యాన్ చేసిన బాలీవుడ్‌

పుల్వామా ఉగ్ర‌దాడి ఫ‌లితం పాక్‌పై చాలా బాగానే ప్ర‌భావం చూపుతుంది. ఒక‌వైపు రాజకీయ ఒత్తిళ్ల‌ను పాకిస్థాన్ ఎదుర్కొంటుంది. ఇప్పుడు సినిమా రంగం.. బాలీవుడ్ కూడా పాకిస్థానీ క‌ళాకారుల‌ను బ్యాన్ చేసింది.