వైసీపీలోకి వెళ్దామంటూ టీడీపీ ఎంపీపై కుమార్తె ఒత్తిడి!
Send us your feedback to audioarticles@vaarta.com
గత కొద్దిరోజులుగా టీడీపీలో జరుగుతున్న పరిణామాలతో విసిగివేశారిపోయిన ఆ ఎంపీ కుమార్తె.. ఇక ఒక్క క్షణం కూడా పార్టీలో ఉండటానికి వీల్లేదు వైసీపీలోకి వెళ్లి తీరాల్సిందేనని గట్టిగా పట్టుబట్టిందని వార్తలు వినవస్తున్నాయి. ఇంతకీ ఎవరా ఎంపీ..? ఎందుకు పార్టీ మారాలని ఒత్తిడి తెస్తున్నారు? ఇప్పుడున్న పార్టీలో అంతగా వచ్చిన ఇబ్బందులేంటి..? అనే విషయాలు తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే మరి.
ఎంపీ శివప్రసాద్.. ఈ పేరు పెద్దగా గుర్తులేకపోయినా గెటప్స్ ఎంపీ అంటే టక్కున గుర్తొస్తారాయన. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు ఆప్తమిత్రుడిగా పేరున్న శివప్రసాద్ వార్తల్లోకెక్కని రోజు ఒక్కటి కూడా లేదంటే ఎలాంటి అతిశయోక్తి లేదేమో. ఈయన తిరుపతిలో ఉంటేనే లోకల్ పేపర్లు ఓ రేంజ్లో రాస్తాయ్.. ఇక పార్లమెంట్ సమావేశాలు జరిగాయంటే జాతీయ స్థాయిలోని పేపర్లు, టీవీలు మొదలుకుని వెబ్సైట్లు సైతం వార్తలు వండివార్చేస్తాయి. అలా జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గత ఏడాదిలో జరిగిన కొన్ని పరిణామాలు ఆయన కుటుంబాన్ని తీవ్రంగా కలచివేశాయట. ఈ వ్యవహారాలన్నీ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి పరిష్కారాలు చూపలేదని సమాచారం. మరీ ముఖ్యంగా ఎంపీ కుమార్తె మాధవిలత కారు యాక్సిడెంట్ చేయడమే కాకుండా బెదిరించి బండ బూతులు తిట్టారు.. అయితే ఆ సమయంలో తండ్రి ఎంపీ అయినప్పటికీ ఆమె ఏమీ చేయలేని దుస్థితిలో ఉండిపోయారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించినప్పటికీ తగిన న్యాయం జరగలేదని.. ఈ వ్యవహారం సీఎంకు తెలిసినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో అప్పట్నుంచి ఆమె తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది.
ఇలాంటి సందర్భాలు కోకొల్లలు..!?
ఇక మరికొన్ని సందర్భాల్లో తాను దళితుడినని తక్కువగా చూస్తున్నారని ఏకంగా బహిరంగ సభలోనే టీడీపీ తిరుగుబాటు చేసినట్లుగా ప్రవర్తించారాయన.!! ఇలా ఒకట్రెండుసార్లు కాదు పలుమార్లు తన అసంతృప్తిని బహిరంగంగా తెలియజేశారు. పైకి అలా గెటప్స్‌తో గడిపేస్తున్నప్పటికీ గతంలో జరిగిన విషయాలను ఒకసారి తలుచుకుని ఇంట్లో వారికి బాధపడ్డ సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయట. మరోవైపు ఆయన కుమార్తె సైతం గట్టిగా ఒత్తిడి తీసుకొస్తుండటంతో ఏం చేయాలో శివప్రసాద్‌కు పాలుపోవట్లేదు. పైగా తాను ఎంపీగా గెలిచినప్పటికీ ఎలాంటి పదవి లేకుండానే ఐదేళ్లు గడిచిపోయిందనే అసంతృప్తి కూడా ఉందట.
ఫైనల్‌గా ఏం చేయబోతున్నారు..!!
పార్టీ మారాలనుకుంటున్నట్లు చిత్తూరు జిల్లాకు చెందిన ఓ కీలకనేతతో ఎంపీ కుమార్తె మాధవీలత చెప్పినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే జగన్ పాదయాత్ర ముగించుకుని తిరుమల వెంకన్నను దర్శించుకోవడానికి వస్తారని ఆయన దగ్గర విషయం ప్రస్తావనకు తెస్తానని ఆమెకు ఆ నేత చెప్పినట్లు సమాచారం. అయితే జగన్ ఓకే అంటే ఎంపీ శివప్రసాద్.. తన ఆప్తమిత్రుడ్ని వదిలి బయటికొస్తారా..? లేదా ఏం జరిగినా మిత్రుడి కోసమే కదా అని అదే టీడీపీలోనే కొనసాగుతారో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com