అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ .. ఎవరెవరంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను ఈరోజు కూడా స్పీకర్ సస్పెండ్ చేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టిన టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తీర్మానానికి అనుగుణంగా.. దీనిపై స్పీకర్ చర్యలు తీసుకున్నారు.
దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వెలగపూడి రామకృష్ణబాబు, బెందాళం అశోక్, గొట్టిపాటి రవికుమార్, ఆదిరెడ్డి భవాని, గణబాబు, జోగేశ్వరరావు, గద్దె రామ్మోహన్, ఎం. రామరాజు, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్‌లను శాసనసభ నుంచి ఒక్కరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. సోమవారం ఐదుగురు తెదేపా ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. వారిపై బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్ వేటు వేశారు. తాజాగా మిగిలిన సభ్యులను ఈ ఒక్కరోజు సభ నుంచి సస్పెండ్ చేశారు.
నిన్న ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. వారిపై బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్ వేటు వేశారు స్పీకర్. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో చోటు చేసుకుంటున్న వరుస మరణాలపై చర్చ జరపాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. దీనిపై సభలో ప్రభుత్వం ప్రకటించినా విపక్షం శాంతించలేదు. పోడియం చుట్టూ చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. దీంతో వీరిని బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout