Nandamuri Balakrishna:బాబోయ్ బాలయ్య .. బయటకు తెవడం ఏమో గానీ, బావను ఇరికించేస్తావా ఏంది .?
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్టీఆర్ కుమారుడే అయినా, స్వయంగా ఎమ్మెల్యే అయినా టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడింది చాలా తక్కువ. శాసనసభ సమావేశాలకు హాజరుకావడం అవసరమైన విషయాలపై మాట్లాడటం వరకే ఆయన పరిమితం. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారో నాటి నుంచి బాలయ్య విశ్వరూపం చూపిస్తున్నారు. అసెంబ్లీలో తొడకొట్టడాలు, మీసం తిప్పడాలు చేస్తూ నవ్వుల పాలవుతున్నారు. దీనిని స్పీకర్ తొలి తప్పుగా మన్నించి క్షమించి వదిలేశారు. కానీ తీరు మార్చుకోని బాలకృష్ణ ఆ మరుసటి రోజు సభలోకి విజిల్స్ పట్టుకొచ్చి రచ్చ చేశారు. స్పీకర్ పోడియం వద్ద పేపర్లు విసిరేసి, ఆ వెంటనే చంద్రబాబు కూర్చొనే కూర్చిపై నిలబడి విజిల్స్ వేశారు.
అసెంబ్లీలో బాలయ్య రచ్చ :
బావ కళ్లలో ఆనందం చూడాలనో లేకపోతే.. టీడీపీని నడిపించాలని అనుకుంటున్నారో కానీ బాలయ్య రచ్చను మాత్రం జనం తట్టుకోలేకపోతున్నారు. స్వతహాగా బాలకృష్ణ అంటే ఎంతో గౌరవంగా మెలిగే వైసీపీ సభ్యులు కూడా ఆయన తీరును తప్పుబడుతున్నారు. అంబటి రాంబాబు వంటి వారు కాస్త ఘాటుగానే కౌంటర్లు ఇస్తున్నారు. బావ కూర్చిపై నిలబడటం కాదు.. అందులో కూర్చుంటే చూడాలని తాము కోరుకుంటున్నామని చురకలంటించారు.
చంద్రబాబు కోసం రోడ్డెక్కిన తెలుగు తమ్ముళ్లు:
ఈ సంగతి పక్కనబెడితే.. చంద్రబాబు కోసం ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు ప్రాంతాల్లో తెలుగుదేశం శ్రేణులు ధర్నాలు చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు వంటి చోట్ల ఏకంగా ఐటీ ఉద్యోగులు తమ పనుల్ని పక్కనబెట్టుకుని మరి నిరసనలు తెలియజేస్తూ చంద్రబాబుకు అండగా వుంటామని స్పష్టం చేశారు. అటు విదేశాల్లోనూ బాబు అరెస్ట్ అక్రమమంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక చంద్రబాబు కోసం ఢిల్లీ నుంచి దిగిన లాయర్లు సైతం ఆయనను విడిపించాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇంతమంది ఇన్ని రకాలుగా చేస్తుంటే బాలయ్య మాత్రం బావను ఇంకాస్త ఇరికించేలా వున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
బాలయ్య మైక్ అందుకుంటే ఎటు నుంచి ఎటు వెళ్తారో :
బాలయ్య మైక్ అందుకుంటే ఏం మాట్లాడతారో, ఎటు నుంచి ఎటు వెళ్తారోనని తెలుగు తమ్ముళ్లు భయపడతారు. నాన్నగారు అంటూ మొదలెట్టి, రాజకీయాలు, సినిమాలు, ఆధ్యాత్మికం మీదుగా ఏటో వెళ్తుంది బాలకృష్ణ ప్రసంగం. చివరిలో మా బ్లడ్, మా బ్రీడు అంటూ డైలాగ్స్ కొట్టి ముగిస్తారు. ఈ లోగా సోషల్ మీడియాలో నటసింహాన్ని ఆడుకుంటూ వుంటారు నెటిజన్లు. తాజాగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసును చాలా చిన్నదని, దానికే ఇంత హడావుడా అంటూ బాలయ్య వ్యాఖ్యానించారు. అంటే బాలయ్యకు రూ.371 కోట్లు చాలా చిన్న విషయంగా కనిపిస్తుందా.. ప్రజాప్రతినిధిగా ప్రజాధనానికి రెస్పాన్సిబిలిటీగా వుండాల్సిన ఆయన ఇలా మాట్లాడటం సరికాదు. ప్రజా ధనానికి ట్రస్టీగా వుండాల్సిన వాళ్లే దానిని ఇష్టానుసారం దోచుకుంటే చూస్తూ వూరుకోవాలా . ఇది ఆయన అవగాహన లేమికి, రాజకీయ పరిపక్వతకు నిదర్శనమని విశ్లేషకులు మండిపడుతున్నారు.
సబ్జెక్ట్ తెలుసుకోమంటూ బాలయ్యకు కౌంటర్లు :
ఇలాంటి వారిని లీడర్లుగా వుంటే, తెలుగుదేశం పార్టీలో వున్న నేతలు తమ భవిష్యత్తుకు గ్యారెంటీపై భయపడుతున్నారు. చంద్రబాబు లేకపోతే నాలుగు రోజులు పార్టీని నడిపించ లేనివాళ్లు ముందు ముందు ఏం చేస్తారోనని తెలుగు తమ్ముళ్లలో భయం పట్టుకుంది. ముందు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం అంటే ఏమిటి..? ఏం జరిగింది..? ఎలా జరిగింది..? సీఐడీ ఎలా బావను అరెస్ట్ చేసింది.. ? వంటి విషయాలను బాలయ్య అధ్యయనం చేసి ఆ తర్వాత మీడియా ముందుకు వస్తే బాగుంటుందని కొందరు చురకలు అంటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com