Nandamuri Balakrishna:ఏపీ అసెంబ్లీలో బాలయ్య రచ్చ : విజిల్స్ వేస్తూ, సీట్లపైకెక్కి నినాదాలు.. స్పీకర్ ఆగ్రహం
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రెండో రోజు కూడా టీడీపీ సభ్యులు సభలో నానా హంగామా సృష్టించారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ రెచ్చిపోయారు. నిన్న వైసీపీ సభ్యుల వైపు చూస్తూ మీసాలు తిప్పి, తొడ కొట్టిన ఆయన ఇవాళ అదే స్థాయిలో రచ్చ చేశారు. ఈసారి ఏకంగా విజిల్స్ ఊదుతూ నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలిపిన బాలయ్య.. అనంతరం సభలో తన బావ చంద్రబాబు కూర్చొనే సీటుపై నిల్చోని విజిల్ ఊదారు. అయితే బాలయ్య తీరుపై మంత్రి అంబటి రాంబాబు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సీటులో కూర్చోవాల్సిన టైంలో ఇలా నిలబడి నిరసన తెలియజేయడం ఏంటని ప్రశ్నించారు. తండ్రికి వెన్నుపోటు పొడిచి అధికారం అందుకున్న వ్యక్తి సీటును లాక్కునే టైం వచ్చిందని అంబటి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బాలయ్యకు తోడుగా గద్దె రామ్మోహన్ :
అయితే బాలకృష్ణ చర్యలను స్పీకర్ తమ్మినేని సీతారాం తప్పుబట్టారు. విజిల్స్ తీసుకోవాలన్న స్పీకర్ ఆదేశాలతో మార్షల్స్ టీడీపీ సభ్యుల వద్దకు వెళ్లగా.. విపక్ష ఎమ్మెల్యేలు వారితో దురుసుగా ప్రవర్తించారు. బాలకృష్ణకు మద్ధతుగా మరో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా విజిల్స్ వేశారు. అటు సభలో ఫోటోలు, వీడియోలు తీసి నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను అచ్చెన్నాయుడు, బీ అశోక్‌లను పూర్తిగా అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అలాగే నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వెలగపూరి రామకృష్ణలను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంపై సభలో చర్చ :
అనంతరం స్పిల్ డెవలప్‌మెంట్ స్కాంపై సభలో చర్చ జరిగింది. మాజీ మంత్రి కన్నబాబు చర్చను ప్రారంభించారు. చంద్రబాబు కుదుర్చుకుంది చీకటి ఒప్పందమన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే స్కిల్ స్కాం జరిగిందని.. సచివాలయంలోని నోట్ ఫైళ్లు కూడా మాయం చేశారని కన్నబాబు ఆరోపించారు. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు.. ఇప్పుడు ప్రిజనరీగా మారారని ఆయన సెటైర్లు వేశారు. ఈ స్కాంకు సంబంధించి చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెట్టారని.. ఆయన ఆదేశాలతోనే నిధులను విడుదల చేశారని కన్నబాబు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com