ఆయన 16 నెలలు వుండొచ్చాడని.. చంద్రబాబును 16 రోజులైనా జైల్లో పెట్టాలని : జగన్‌పై బాలయ్య చురకలు
Send us your feedback to audioarticles@vaarta.com
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, రిమాండ్‌పై స్పందించారు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి ఆధారాలు లేకుండా కక్ష సాధింపుతో కుట్ర చేశారని మండిపడ్డారు. జగన్ జైలుకు వెళ్లొచ్చారని.. అందరినీ పంపాలని చూస్తున్నారని బాలయ్య ఎద్దేవా చేశారు. జగన్ 16 నెలలు జైలులో వుండొచ్చారని.. చంద్రబాబును కనీసం 16 రోజులైనా వుంచాలని కుట్ర చేస్తున్నారరని ఆయన ఆరోపించారు. పేద పిల్లల కోసం చంద్రబాబు ఎన్నో విద్యాసంస్థలు తీసుకొచ్చారని.. వేలమంది యువతకు ఉపాధి కల్పించారని బాలకృష్ణ గుర్తుచేశారు. హిందూపురంలో 1200 మందికి ఉద్యోగాలు ఇచ్చారని.. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగితే ఆధారాలు చూపించాలి కదా అని ఆయన ప్రశ్నించారు.
ఇలాంటివి చాలా చూశాం:
జగన్మోహన్ రెడ్డిపై ఈడీ సహా అనేక కేసులు వున్నాయని.. బెయిల్‌పై తిరుగుతున్నారని బాలయ్య మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. సీఎం కేవలం పాలసీ మేకర్ అని.. అమలు చేసేది అధికారులేనని బాలయ్య గుర్తుచేశారు. అజేయ కల్లం ప్రతిపాదిస్తే, ప్రేమ్ చంద్రారెడ్డి అమలు చేశారని.. ఇందుకోసం ప్రభుత్వం రూ.370 కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు. 2.13 లక్షల మందికి స్కిల్ డెవలప్‌మెంట్ కింద శిక్షణ ఇచ్చారని.. డిజైన్ టెక్ సంస్థను ప్రశంసిస్తూ జగన్ ప్రభుత్వం అభినందన లేఖ ఇచ్చిందని బాలయ్య వెల్లడించారు. ఇలాంటివి చాలా చూశామని.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని, చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకొస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు:
ఉన్న సంస్థలను విధ్వంసం చేసిన జగన్ .. యువతను గంజాయికి బానిస చేశారని దుయ్యబట్టారు. కుదిరితే పీల్చే గాలిపైనా పన్నులు వేస్తారని.. రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని బాలకృష్ణ పేర్కొన్నారు. తెలుగువాడి సత్తా, పౌరుషాన్ని చూపిద్దామని ఆయన పిలుపునిచ్చారు. తానొస్తున్నానని.. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదని బాలయ్య భరోసా కల్పించారు. చంద్రబాబుకు సానుభూతి తెలిపిన ప్రతి ఒక్కరిని కలుస్తామన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments