చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు!
Send us your feedback to audioarticles@vaarta.com
రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి.. వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేతతో భేటీ కావడం జరిగింది. సుమారు అరగంట భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మేడా.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గంజాయి వనంతో.. వైయస్ జగన్ను తులసి వనంతో ఆయన పోల్చారు. "చంద్రబాబు అనే గంజాయి వనంలో నుంచి తులసి వనంలోకి అడుగుపెట్టినందుకు ఆనందంగా ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ.. కాంగ్రెస్ను ఎదురించి సొంత పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ జగన్.. తన తండ్రి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజాస్వామ్య విలువలు కలిగిన వైఎస్ జగన్ లాంటి మంచి వ్యక్తి వద్దకు రావడం సొంతింటికి వచ్చినంత సంతోషంగా ఉంది. ఇన్నాళ్లు టీడీపీలో మెలగలేక ఆ పార్టీని వీడాను. అధికారుల సహకారంతో ఇప్పటి వరకు రాజంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను" అని ఆయన చెప్పుకొచ్చారు.
చంద్రబాబు నిన్ను నమ్మం..!
"వైఎస్ జగన్ సమర్ధుడని నమ్మి వైసీపీలో చేరేందుకు ముందుకు వచ్చాను. ప్రజలకు సేవ చేసేందుకు వైఎస్ఆర్ కుటుంబం చేస్తున్న పోరాటాలకు ఆకర్షితుడినై పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను. చంద్రబాబు.. నిన్ను నమ్మం.. అందుకే వైసీపీలో చేరుతున్నాను. చంద్రబాబు చెప్పేది ఒకటి చేసేది మరొకటి. చంద్రబాబు అక్రమాలను చూసి జీర్ణించుకోలేకపోతున్నాను. ఈ నెల 31న వైయస్ఆర్సీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నాం. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసి, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి చంద్రబాబు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు. జగన్ సూచనల మేరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరుతాను. ప్రజాస్వామ్య విలువలకు వన్నె తెచ్చే విధంగా జగన్ను ముఖ్యమంత్రిని చేసుకుంటాం" అని మేడా వ్యాఖ్యానించారు. కాగా ఇప్పటికే టీడీపీ నుంచి మేడాను సప్పెండ్ చేస్తున్నట్లు అధిష్టానం ప్రకటించింది. త్వరలో మేడా చేయనున్న రాజీనామాకు సైతం అధిష్టానం స్వీకరించి ఆమోదాల్సి ఉంది.. అప్పటి వరకూ ఈయన ఎమ్మెల్యేగానేకొనసాగుతారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout