ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు అరెస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన ఈఎస్ఐ కుంభకోణంలో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. శుక్రవారం తెల్లవారు జామున గ్రామానికి విజయవాడ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిమ్మాడ గ్రామం నుంచి విజయవాడకు తరలించారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిమ్మాడ గ్రామంలో ప్రత్యేక పోలీసు బలగాలు మొహరించాయి. కాగా.. గత ప్రభుత్వ హయాంలో ఈఎస్ఐలో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఇదే సమయంలో అచ్చెన్నాయుడ్ని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే.. ఆయనతో పాటు మరికొందర్ని అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
అసలేం జరిగింది..!?
శుక్రవారం తెల్లారుజామున ప్రత్యేక బస్సుల్లో విజయవాడ నుంచి ప్రత్యేక బస్సుల్లో నిమ్మాడ గ్రామంలోని అచ్చెన్న ఇంటికి ఏసీబీ అధికారులు చేరుకున్నారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. అనంతరం అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడ్నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. ఈఏస్ఐ నిధులు దుర్వినియోగంపై ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు కానీ.. అచ్చెన్న అభిమానులు కానీ నిమ్మాడ గ్రామంలో ఎలాంటి ఆందోళన, అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా ప్రత్యేక పోలీసు బలగాలు భారీ మొహరించాయి.
150 కోట్లగా పైగా అవినీతి..!
కాగా.. ఏపీ ఈఎస్ఐలో భారీ కుంభకోణం బయటపడ్డ సంగతి తెలిసిందే. ఈ స్కామ్‌ను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బయటపెట్టి ఓ నివేదికను వెలుగులోకి తెచ్చింది. ఈఎస్ఐ లేని కంపెనీలు నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని ఆర్డర్లు ఇచ్చినట్లు తేలిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈఎస్ఐ డైరెక్టర్లు రేట్ కాంట్రాక్ట్‌లో లేని కంపెనీలకు రూ.51కోట్లు చెల్లించినట్లు గుర్తించడం జరిగింది. మొత్తం రూ.988 కోట్లకు గాను రూ.150 కోట్లకుపైగా అవినీతి జరిగిందని అధికారులు గుర్తించారు. ఇందులో ఈఎస్ఐ రవికుమార్, రమేష్, విజయను బాధ్యులుగా గుర్తించారు. అయితే అప్పట్లో అచ్చెన్న స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో టెలీ హెల్త్ సర్వీసెస్‌కు నామినేషన్ పద్దతిలో కేటాయించాలని తాను లేఖ రాశానని చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు ఏమంటారో.. వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout