R. Krishnaiah:టీడీపీ నేతల అరాచకం.. బీసీ ఎంపీ ఆర్.కృష్ణయ్యపై రాళ్ల దాడి
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ నేతల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఓడిపోతున్నామని తెలిసి నిస్సహాయతతో వైసీపీ నేతలపై హత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. ఇటీవల విజయవాడలో సీఎం జగన్‌పై రాళ్ల దాడి హత మార్చాలని చూశారు. ఇప్పుడు బడుగు బలహీన వర్గాల నేత, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య, స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై హత్యాయత్నం చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వీరిపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరులు రాళ్ల దాడికి పాల్పడ్డారు.
ఈ దాడిలో ఓ రాయి ఆర్.కృష్ణయ్యకు తగిలింది. అయితే అదృష్టవశాత్తు ఆ రాయి తలకి తగలకుండా వీపుకి తగలడంతో ప్రాణాపాయం తప్పింది. ఇలాంటి పిరికిపంద రాజకీయాలు చేస్తే ఎవరూ భయపడరని ప్రజలు మాపై చూపిస్తున్న ఆదరణ తట్టుకోలేక ఎలాగైనా మమ్మల్ని హతమార్చాలని ఇలాంటి రాళ్ల దాడులు చంద్రబాబు ఆదేశాలతో బొజ్జల సుధీర్ రెడ్డి చేయిస్తున్నాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో ఇదే ఏర్పేడులో ఇసుక మాఫియాతో ఇబ్బంది పడుతున్న రైతులను 17 మందిని లారీల ద్వారా చంపించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది అని పేర్కొన్నారు.
అలాగే నేడు తమను కూడా హతమార్చి రాజకీయ ప్రత్యర్థి లేకుండా చేసుకోవాలని బొజ్జల సుధీర్ రెడ్డి ఆరాటపడుతున్నాడని మండిపడుతున్నారు. తనపై జరిగిన రాయి దాడికి కారణం చంద్రబాబేనని ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. తనను చంపాలని టార్గెట్ చేశారని ఇలాంటి దాడులకు తాను భయపడబోనని అన్నారు. బీసీలంతా వైసీపీ వైపే ఉన్నారని చెప్పారు. బీసీలపై జరిగిన రాళ్లదాడికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బలహీన వర్గాలపై రాయి వేయించిన చంద్రబాబుకి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని హెచ్చరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com