R. Krishnaiah:టీడీపీ నేతల అరాచకం.. బీసీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్యపై రాళ్ల దాడి

  • IndiaGlitz, [Friday,May 10 2024]

టీడీపీ నేతల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఓడిపోతున్నామని తెలిసి నిస్సహాయతతో వైసీపీ నేతలపై హత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. ఇటీవల విజయవాడలో సీఎం జగన్‌పై రాళ్ల దాడి హత మార్చాలని చూశారు. ఇప్పుడు బడుగు బలహీన వర్గాల నేత, రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య, స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై హత్యాయత్నం చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వీరిపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరులు రాళ్ల దాడికి పాల్పడ్డారు.

ఈ దాడిలో ఓ రాయి ఆర్.కృష్ణయ్యకు తగిలింది. అయితే అదృష్టవశాత్తు ఆ రాయి తలకి తగలకుండా వీపుకి తగలడంతో ప్రాణాపాయం తప్పింది. ఇలాంటి పిరికిపంద రాజకీయాలు చేస్తే ఎవరూ భయపడరని ప్రజలు మాపై చూపిస్తున్న ఆదరణ తట్టుకోలేక ఎలాగైనా మమ్మల్ని హతమార్చాలని ఇలాంటి రాళ్ల దాడులు చంద్రబాబు ఆదేశాలతో బొజ్జల సుధీర్ రెడ్డి చేయిస్తున్నాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో ఇదే ఏర్పేడులో ఇసుక మాఫియాతో ఇబ్బంది పడుతున్న రైతులను 17 మందిని లారీల ద్వారా చంపించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది అని పేర్కొన్నారు.

అలాగే నేడు తమను కూడా హతమార్చి రాజకీయ ప్రత్యర్థి లేకుండా చేసుకోవాలని బొజ్జల సుధీర్ రెడ్డి ఆరాటపడుతున్నాడని మండిపడుతున్నారు. తనపై జరిగిన రాయి దాడికి కారణం చంద్రబాబేనని ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. తనను చంపాలని టార్గెట్ చేశారని ఇలాంటి దాడులకు తాను భయపడబోనని అన్నారు. బీసీలంతా వైసీపీ వైపే ఉన్నారని చెప్పారు. బీసీలపై జరిగిన రాళ్లదాడికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బలహీన వర్గాలపై రాయి వేయించిన చంద్రబాబుకి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని హెచ్చరించారు.

More News

AP Schemes: ఏపీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్.. పథకాల నిధుల విడుదలకు హైకోర్టు అనుమతి

ఏపీ ఎన్నికల వేళ చర్చనీయాంశమైన సంక్షేమ పథకాల నిధుల విడుదలపై రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

'సత్య' మూవీ అచ్చమైన తెలుగు సినిమాగా ఉంటుంది: నిర్మాత శివమల్లాల

తమిళంలో హిట్ కొట్టిన 'రంగోలి' మూవీ తెలుగులో మే 10న 'సత్య'గా విడుదల కాబోతోంది. హమరేష్, ప్రార్ధన జంటగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో వచ్చిన రంగోలి సినిమాని

Chiranjeevi: పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి.. చరణ్‌ భావోద్వేగం..

నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు అందుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. తన నటన, డ్యాన్సులు, సేవా కార్యక్రమాలతో కోట్లాది మంది అభిమానుల మనసు సొంతం చేసుకున్నారు.

Kirrak RP: రోజాకు ఇచ్చిపడేసిన కిర్రాక్ ఆర్పీ.. మామూలు పంచ్‌లు కాదుగా..

ఏపీ ఎన్నికల ప్రచారంలో రోజురోజుకు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన వారు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారిపోయారు. ఇప్పుడు మొన్నటివరకు

Allu Arjun:నా ప్రేమ, మద్దతు పవన్ కల్యాణ్‌కే.. అల్లు అర్జున్ ట్వీట్..

ఏపీ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్‌ పిఠాపునం నియోజకవర్గం