Kesineni Nani: కేశినేని నానిపై టీడీపీ నేతలు కౌంటర్ ఎటాక్.. వైసీపీ కోవర్టు అంటూ ఆరోపణలు..

  • IndiaGlitz, [Thursday,January 11 2024]

టీడీపీకి రాజీనామా చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం సీఎం జగన్‌ను కలిసిన అనంతరం చంద్రబాబు, లోకేశ్‌లపై నాని ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ విమర్శలపై తెలుగుదేశం పార్టీ నాయకులు కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఆయన సోదరుడు కేశినేని చిన్ని విమర్శలు గుప్పించారు. 1999 నుంచి తమ కుటుంబంలో గొడవలు ఉన్నాయని.. దీనికి చంద్రబాబుకు సంబంధం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్‌ను విమర్శించే స్థాయి నానికి లేదని ఆయన మండిపడ్డారు. కేశినేని నాని వైసీపీకి కోవర్టు అని..నాలుగేళ్ల నుంచి వైసీపీకి టచ్‌లో ఉన్నారని ఆరోపించారు. 40 ఏళ్లలో మహామహులే వెళ్లిపోయినా టీడీపీకి ఏం కాలేదని.. ఎందరో వస్తుంటారు.. పోతుంటారు అని తెలిపారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కలను చూసి బుద్ధి తెచ్చుకోవాలని నానికి సలహా ఇచ్చారు. పార్టీ వీడినా ఏరోజు అధినేత చంద్రబాబును ఒక్క మాట కూడా విమర్శించలేదని గుర్తు చేశారు. అంత హుందాగా రాజకీయాలు చేశారు కాబట్టే ఇవాళ ఓ రాష్ట్రానికి సీఎం, మంత్రి అయ్యారని కొనియాడారు. అహంకారంతో విర్రవీగుతున్నావ్ అని.. టీడీపీని ఖాళీ చేసే సీన్ నానికి లేదంటూ చురకలు అంటించారు.

ఇక చిన్నితో పాటు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా నాని మీద తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు కాళ్లు పట్టుకుని బీఫాం తెచ్చుకున్నావ్.. ఇప్పుడు జగన్ కాళ్లు పట్టుకోవడానికి వెళ్లారంటూ విమర్శించారు. కేశినేని నాని అప్పులు ఎగ్గొట్టాడని, కబ్జాలు చేశాడని ఆరోపించారు. నాని అవినీతి చిట్టా అంతా తన దగ్గర ఉందని త్వరలోనే విప్పుతానని హెచ్చరించారు. జిల్లాలో టీడీపీని ఖాళీ చేసేంత దమ్ము ఉందా అని సవాల్ విసిరారు.

ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో విజయవాడ నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన పివీపీ కూడా కేశినేని నానిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంతే.. వీడి బుద్ది గురించి బెజవాడంతా తెలుసుకదరా అబ్బాయ్ అని ట్వీట్‌ చేశారు. అంతకుముందు టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన అనంతరం కూడా పీపాల బస్తా, బెజవాడకే గుదిబండలా తయారయ్యావ్ నువ్వు.. ఏదో మచ్చ ఏసుకుని పుట్టావు, పార్టీ పుణ్యమా అని పదేళ్లు బండి కొనసాగించావు, బ్యాంకులను బాదావు, జనాలని, ఉద్యోగులని పీల్చి పిప్పి చేసావు.. ఇకనైనా ఒట్టి మాటలు కట్టిపెట్టి, అన్ని మూసుకుని మూలపడుండు పుండాకొర్అంటూ ఘాటు విమర్శలు చేశారు. మొత్తానికి కేశినేని నాని టీడీపీని వీడి వైసీపీని చేరనుండటంతో బెజవాడ రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి.

More News

Traffic Challans: తెలంగాణ వాహనదారులకు శుభవార్త.. పెండింగ్ చలాన్ల చెల్లింపు గడువు పెంపు..

వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. పెండింగ్ చలాన్ల గడువును ఈనెల 31వ తేదీ వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Kesineni Nani: చంద్రబాబు పచ్చి మోసగాడు.. కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు..

టీడీపీ అధినేత చంద్రబాబు పచ్చి మోసగాడు అని విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కేశినేని నాని, ఆయన కుమార్తె సీఎం జగన్‌ను కలిశారు.

BRS MLAs: మధురై కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. రీజన్ ఇదే..

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి తమిళనాడులోని మధురై కోర్టుకు హాజరయ్యారు. ప్రస్తుతం వీరు కోర్టులో కూర్చుని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

YSRCP: వైసీపీకి వరుస షాక్‌లు.. మరో నేత గుడ్ బై!

ఎన్నికల వేళ అధికార వైసీపీకి ఊహించని షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. టికెట్ రాని నేతలతో పాటు పార్టీలో ప్రాధాన్యత దక్కని వారందరూ పార్టీని వీడుతున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు

TSPSC చైర్మన్, సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న TSPSC చైర్మన్, సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదించారు. కాంగ్రెస్ ప్రభుత్వం