TDP Leaders:నరసరావుపేటలో టీడీపీ నేతల దౌర్జన్యం : బాకీ తీర్చమన్నందుకు .. బాధితుడు, అండగా వచ్చిన వైసీపీ కార్యకర్తలపై దాడి
Send us your feedback to audioarticles@vaarta.com
నరసరావుపేటలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. వైసీపీ నేతలపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడటంతో ఆదివారం పట్టణంలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నప్పటికీ అసలు కారణం వేరే వుందని సమాచారం. వివరాల్లోకి వెళితే.. నరసరావుపేట పట్టణానికి చెందిన జోవుద్దీన్ కొద్దిరోజుల కిందట చల్లా సుబ్బారావు అనే స్థానిక టీడీపీ నాయకునికి కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు. జోవుద్దీన్ తన బాకీ చెల్లించాల్సిందిగా అడుగుతూ వుండటంతో .. చల్లా సుబ్బారావు మాత్రం అప్పు చెల్లించకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు.
టీడీపీ నేతను నిలదీసినందుకు :
ఈ క్రమంలో ఆదివారం చల్లా సుబ్బారావు ఇంటికి వెళ్లి తన బాకీ చెల్లించాల్సిందిగా నిలదీశాడు జోవుద్దీన్. విషయం తెలుసుకున్న టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు, సీనియర్ నేత కడియాల రమేష్, కార్యకర్తలు చల్లా సుబ్బారావు ఇంటికి చేరుకున్నారు. రావడం రావడంతోనే ఇంటిలో వున్న జోవుద్దీన్ అతని సంబంధీకులపై దాడికి దిగారు. కర్రలు, రాళ్లతో విచక్షణరహితంగా చితకబాది పెట్రోల్ పోసి నిప్పంటిస్తామని బెదిరించారు.
టీడీపీ నేతలకు ఎమ్మెల్యే వార్నింగ్ :
దీనిపై సమాచారం అందుకున్న వైసీపీ నేతలు.. బాధితులకు అండగా నిలిచారు. వారిపైనే టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు. దీనిని వైసీపీ కేడర్ తీవ్రంగా ప్రతిఘటించడంతో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. టీడీపీ నేతల దాడిలో పలువురు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అటు వైసీపీ నేత, స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఘటనాస్థలికి చేరుకుని వైసీపీ కార్యకర్తలను శాంతింపజేశారు. బాధితులపై దౌర్జన్యానికి దిగితే సహించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. టీడీపీ నేతలకు సరైన సమయంలోనే ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన జోస్యం చెప్పారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ రెడ్డి పోలీసులను ఆదేశించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout