Pawan Kalyan:పవన్ కల్యాణ్‌కు టీడీపీ నేత వర్మ షాక్.. పోటీలో ఉంటానని స్పష్టం..

  • IndiaGlitz, [Wednesday,March 20 2024]

కాకినాడ ఎంపీ అభ్యర్థిగా టీటైమ్ యజమాని తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి అసంతృప్తికి కారణమయ్యేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పిఠాపురం పోటీ చేస్తానని పవన్ ప్రకటించడంతో అక్కడి టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ అనుచరులు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చి నిరసన తెలిపారు. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు.

దీంతో వివాదం సద్దుమణిగడంతో పవన్ కళ్యాణ్ తరుఫున వర్మ ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే అంతా బాగుందనుకున్న తరుణంగా పవన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఇబ్బందులకు గురిచేసేలా ఉన్నాయి. తన కోసం, పార్టీ కోసం ఎంతో త్యాగం చేసిన ఉదయ్‌కు కాకినాడ ఎంపీ టికెట్ కేటాయించినట్లు చెప్పారు. అయితే ప్రధాని మోదీ, అమిత్ షా సూచిస్తే మాత్రం తాను ఎంపీగా బరిలోకి దిగుతానని.. పిఠాపురం నుంచి ఉదయ్ పోటీ చేస్తారని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే జనసేనానికి లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టాయి.

పవన్ వ్యాఖ్యలపై టీడీపీ నేత వర్మ తాజాగా స్పందించారు. పొత్తులో భాగంగా పవన్ కల్యాణ్‌ కోసం సీటు త్యాగం చేశానని.. ఆయన పోటీ చేయకపోతే తాను బరిలో ఉంటానని స్పష్టంచేశారు. 20 ఏళ్ల నుంచి టీడీపీ కోసం పనిచేస్తున్నానని.. చంద్రబాబు ఆదేశాలతోనే పవన్ కోసం సీటును వదులుకున్నానని చెప్పుకొచ్చారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీగా పోటీచేస్తే పిఠాపురం టికెట్ తనదేనని.. తప్పకుండా పోటీ చేస్తానని వెల్లడించారు.

రాజకీయాల్లో ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని చెబుతూ ఉంటారు. అందులోనూ పొత్తులో ఉన్నప్పుడు సీట్లు విషయం లాంటి సున్నితమైన అంశాలు బహిరంగంగా వ్యాఖ్యానించకూడదు. ఏదైనా ఉంటే ముందుగానే కూటమి సభ్యులతో మాట్లాడాలని.. ఇలా బహిరంగ వ్యాఖ్యలు సరికాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడే పిఠాపురంలో అంతా సద్దుమణిగిందని అనుకుంటున్న తరుణంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మళ్లీ అసమ్మతిని రెచ్చగొట్టే ప్రమాదం ఉందంటున్నారు.

More News

Manchu Family :ఏపీలో ఆ పార్టీలకే ఓటు వేయండి.. మంచు కుటుంబం వ్యాఖ్యలు వైరల్..

తిరుపతిలో జరిగిన మోహన్ బాబు(Mohan Babu) జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, ముఖేష్ రుషి పాల్గొన్నారు.

KTR:ముఖ్యమంత్రి గారు.. రైతుల కన్నీళ్లు కనిపించవా..?: కేటీఆర్

రైతులను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిన్నచూపు చూస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.

TDP: ఎలివేషన్లు బారెడు.. వచ్చిన సీట్లు చారెడు.. ఇది టీడీపీ తీరు..

టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చే బిల్డప్‌లు ఇంకెవ్వరూ ఇవ్వలేరు. తానే గతంలో రాష్ట్రపతిని ఎంపిక చేశాను అంటారు.. కంప్యూటర్ కనిపెట్టాను అంటారు.. ఫోన్ కనిపెట్టాను అంటారు..

Ramcharan:ఘనంగా ప్రారంభమైన రామ్‌చరణ్ కొత్త సినిమా

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభమైంది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వం

Election:దేశంలో మొదలైన ఎన్నికల సందడి.. తొలి విడత నోటిఫికేషన్‌ విడుదల..

దేశవ్యాప్తంగా ఎన్నికల సమరం మొదలైంది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తొలి నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.