బొమ్మ అదుర్స్.. ఆర్ఆర్ఆర్‌ని ఈ వారమే ఫ్యామిలీతో కలిసి చూస్తా: నారా లోకేష్
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘‘ఆర్ఆర్ఆర్’’ మూవీ శుక్రవారం గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా వేలాది సినిమా థియేటర్స్‌లో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. స్పెషల్ షోలు వుండటంతో గురువారం రాత్రి నుంచే థియేటర్లకు పోటెత్తారు. సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఆర్ఆర్ఆర్ సినిమాను వీక్షించారు. ఇంకొందరు ఇదే దారిలో వున్నారు. కాగా.. ఆర్ఆర్ఆర్ సినిమాపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు.
సినిమాకు మంచి ఓపెనింగ్ రివ్యూస్ వస్తున్నాయని.. తారక్, రామ్ చరణ్, రాజమౌళిలను ఆయన అభినందించారు. ఈ వారంలోనే తాను కూడా కుటుంబ సమేతంగా ఆర్ఆర్ఆర్ సినిమాను కచ్చితంగా చూస్తానని నారా లోకేష్ స్పష్టం చేశారు. సినిమా కచ్చితంగా రికార్డులు బ్రేక్ చేస్తుందని ఆయన ఆకాక్షించారు.. అలాగే చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు.
అటు ఆర్ఆర్ఆర్ సినిమాను ఎన్టీఆర్, రాంచరణ్, రాజమౌళి వారి కుటుంబసభ్యులతో కలిసి ప్రేక్షకుల మధ్య చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ రెస్పాన్స్ చూసి చిత్ర యూనిట్ సైతం ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే టికెట్లు భారీగా బుక్ అవ్వగా.. కలెక్షన్ల పరంగా ఆర్ఆర్ఆర్ రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments