బొమ్మ అదుర్స్.. ఆర్ఆర్ఆర్‌ని ఈ వారమే ఫ్యామిలీతో కలిసి చూస్తా: నారా లోకేష్

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘‘ఆర్ఆర్ఆర్’’ మూవీ శుక్రవారం గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా వేలాది సినిమా థియేటర్స్‌లో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. స్పెషల్ షోలు వుండటంతో గురువారం రాత్రి నుంచే థియేటర్లకు పోటెత్తారు. సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఆర్ఆర్ఆర్ సినిమాను వీక్షించారు. ఇంకొందరు ఇదే దారిలో వున్నారు. కాగా.. ఆర్ఆర్ఆర్ సినిమాపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు.

సినిమాకు మంచి ఓపెనింగ్ రివ్యూస్ వస్తున్నాయని.. తారక్, రామ్ చరణ్‌, రాజమౌళిలను ఆయన అభినందించారు. ఈ వారంలోనే తాను కూడా కుటుంబ సమేతంగా ఆర్ఆర్ఆర్ సినిమాను కచ్చితంగా చూస్తానని నారా లోకేష్ స్పష్టం చేశారు. సినిమా కచ్చితంగా రికార్డులు బ్రేక్ చేస్తుందని ఆయన ఆకాక్షించారు.. అలాగే చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు.

అటు ఆర్ఆర్ఆర్ సినిమాను ఎన్టీఆర్, రాంచరణ్, రాజమౌళి వారి కుటుంబసభ్యులతో కలిసి ప్రేక్షకుల మధ్య చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ రెస్పాన్స్ చూసి చిత్ర యూనిట్ సైతం ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే టికెట్లు భారీగా బుక్ అవ్వగా.. కలెక్షన్ల పరంగా ఆర్ఆర్ఆర్ రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు.

More News

అదో కళాఖండం .. మైండ్ బ్లోయింగ్, ఆర్ఆర్ఆర్‌పై చిరు రివ్యూ

దర్శక ధీరుడు  ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ‘‘ఆర్ఆర్ఆర్’’

మున్సిపల్ సిబ్బంది నిర్వాకం.. పన్ను చెల్లించలేదని, ఇంటి ముందు చెత్త కుప్ప

ఇంటిపన్ను, నీటి పన్ను వంటి వాటిని వెంటనే చెల్లించాలంటూ నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలు మైకుల ద్వారా అనౌన్స్‌ చేస్తుంటాయి. అంతేకాదు..

హైదరాబాదీలకు బ్యాడ్ న్యూస్... ఇరానీ ఛాయ్ ధరల పెంపు, కప్పు ఎంతో తెలుసా..?

ఇరానీ చాయ్... హైదరాబాద్‌కు ఎవరొచ్చినా బిర్యానీ తర్వాత ఖచ్చితంగా టేస్ట్ చేసేది దీనినే.

ఆర్ఆర్ఆర్ థియేటర్‌లో విషాదం.. సినిమా చూస్తూ గుండెపోటుతో అభిమాని మృతి

టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన చిత్రం ‘‘ఆర్ఆర్ఆర్’’.

నేపాల్‌లో భారతీయ పేమెంట్స్ సిస్టమ్.. ప్రారంభమైన ‘యూపీఐ’ సేవలు

నోట్ట రద్దు సమయంలో మనదేశంలో అందుబాటులోకి వచ్చిన యునిఫైట్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే.