Nara Lokesh:బావా అని పిలిచే ఆ గొంతు వినిపించదు : తారకరత్న మరణంపై నారా లోకేష్ ఎమోషనల్, పాదయాత్రకు బ్రేక్
Send us your feedback to audioarticles@vaarta.com
సినీనటుడు నందమూరి తారకరత్న అకాల మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తారకరత్న మరణంపై ఆయన బంధువు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమవయస్కులు కావడంతో తొలి నుంచి ఇద్దరి మధ్యా మంచి అనుబంధం వుంది. ఈ నేపథ్యంలో తారకరత్న మరణాన్ని లోకేష్ తట్టుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ఎమోషనల్ ట్వీట్ చేశారు.
ఆ గొంతు ఇక నాకు వినిపించదు:
‘‘బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు. నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగుల చప్పుడు ఆగిపోయింది. నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. నిష్కల్మషమైన నీ ప్రేమ, స్నేహ బంధం మన బంధుత్వం కంటే గొప్పది. తారకరత్నకి కన్నీటి నివాళి అర్పిస్తూ, తారకరత్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను ’’ అంటూ లోకేష్ పోస్ట్ పెట్టారు.
ఆదివారం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన నారా లోకేష్:
మరోవైపు తారకరత్న హఠాన్మరణం నేపథ్యంలో నారా లోకేష్ తన యువగళం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. తారక్ పార్ధిక దేహానికి నివాళులర్పించేందుకు గాను ఆయన ఆదివారం హైదరాబాద్కు వెళ్లనున్నారు. ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర శ్రీకాళహస్తి నియోజకవర్గం గుండా సాగుతోంది. అంతేకాదు ఆయన యువగళం 300 కిలోమీటర్ల మైలు రాయిని కూడా అధిగమించనుంది. 22వ రోజున ఫిబ్రవరి 17 నాటికి లోకేష్ 296.6 కిలోమీటర్ల దూరం నడిచారు. అయితే శనివారం మహాశివరాత్రి కావడంతో ఆయన యాత్రకు బ్రేక్ ఇచ్చారు. తారకరత్న మరణంతో రేపు కూడా లోకేష్ యాత్రకు విరామం ప్రకటించారు. దీంతో 300 కిలోమీటర్లకు సంబంధించిన కార్యక్రమం సోమవారం జరగనుంది.
బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు. నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగుల చప్పుడు ఆగిపోయింది. నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు.(1/2) pic.twitter.com/MLLlp3p60G
— Lokesh Nara (@naralokesh) February 18, 2023
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments