Nara Lokesh:బావా అని పిలిచే ఆ గొంతు వినిపించదు : తారకరత్న మరణంపై నారా లోకేష్ ఎమోషనల్, పాదయాత్రకు బ్రేక్

  • IndiaGlitz, [Sunday,February 19 2023]

సినీనటుడు నందమూరి తారకరత్న అకాల మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తారకరత్న మరణంపై ఆయన బంధువు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమవయస్కులు కావడంతో తొలి నుంచి ఇద్దరి మధ్యా మంచి అనుబంధం వుంది. ఈ నేపథ్యంలో తారకరత్న మరణాన్ని లోకేష్ తట్టుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ఎమోషనల్ ట్వీట్ చేశారు.

ఆ గొంతు ఇక నాకు వినిపించ‌దు:

‘‘బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించ‌దు. నేనున్నానంటూ నా వెంట న‌డిచిన ఆ అడుగుల చ‌ప్పుడు ఆగిపోయింది. నంద‌మూరి తార‌క‌ర‌త్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువ‌తేజం తార‌క‌ర‌త్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీర‌ని లోటు. నిష్క‌ల్మ‌ష‌మైన నీ ప్రేమ‌, స్నేహ బంధం మ‌న బంధుత్వం కంటే గొప్ప‌ది. తార‌క‌ర‌త్న‌కి క‌న్నీటి నివాళి అర్పిస్తూ, తారకరత్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను ’’ అంటూ లోకేష్ పోస్ట్ పెట్టారు.

ఆదివారం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన నారా లోకేష్:

మరోవైపు తారకరత్న హఠాన్మరణం నేపథ్యంలో నారా లోకేష్ తన యువగళం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. తారక్‌ పార్ధిక దేహానికి నివాళులర్పించేందుకు గాను ఆయన ఆదివారం హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర శ్రీకాళహస్తి నియోజకవర్గం గుండా సాగుతోంది. అంతేకాదు ఆయన యువగళం 300 కిలోమీటర్ల మైలు రాయిని కూడా అధిగమించనుంది. 22వ రోజున ఫిబ్రవరి 17 నాటికి లోకేష్ 296.6 కిలోమీటర్ల దూరం నడిచారు. అయితే శనివారం మహాశివరాత్రి కావడంతో ఆయన యాత్రకు బ్రేక్ ఇచ్చారు. తారకరత్న మరణంతో రేపు కూడా లోకేష్ యాత్రకు విరామం ప్రకటించారు. దీంతో 300 కిలోమీటర్లకు సంబంధించిన కార్యక్రమం సోమవారం జరగనుంది.

More News

Taraka Ratna:రాత్రికి హైదరాబాద్‌కు తారకరత్న భౌతికకాయం.. ఎల్లుండి ఫిల్మ్‌ఛాంబర్‌కు , అదే రోజు అంత్యక్రియలు

సినీనటుడు నందమూరి తారకరత్న ఆకస్మిక మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ ముఖ్యంగా నందమూరి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Taraka Ratna: నందమూరి కుటుంబంలో మరో విషాదం.. తారకరత్న అస్తమయం, 23 రోజుల పాటు మృత్యువుతో పోరాటం

నందమూరి కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. సినీనటుడు నందమూరి తారకరత్న కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడారు.

Venky Atluri:మనసున్న ప్రతి మనిషికి నచ్చే సినిమా 'సార్' - దర్శకుడు వెంకీ అట్లూరి

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం 'సార్'(తెలుగు)/‌ 'వాతి'(తమిళం).

Taraka Ratna:అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం, బెంగళూరుకు బాలయ్య.. కాసేపట్లో హెల్త్ బులెటిన్

గుండెపోటుకు గురై ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతోన్న సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్యం

Project K : పెద్ద చేయి, గన్స్‌ పట్టుకున్న వ్యక్తులు.. ప్రభాస్ ‘‘ప్రాజెక్ట్‌ కే ’’ కొత్త పోస్టర్ వైరల్, రిలీజ్ ఎప్పుడంటే..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు అర్జెంట్‌గా ఓ హిట్టు కావాలి. బాహుబలి సిరీస్ తర్వాత ఆయన చేసిన సాహో, రాధేశ్యామ్‌ సినిమాలు డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు పరిశ్రమను తీవ్రంగా నిరాశపరిచాయి.