Gorantla Madhav : నువ్వేమైనా టామ్‌క్రూజ్‌వా.. నీ సుందర ప్రతిబింబం చూసి జనానికి ఏమైందో : చింతకాయల విజయ్
- IndiaGlitz, [Friday,August 05 2022]
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. బాధ్యతగల ఎంపీ పదవిలో ఉండి ఇదేం పాడు పని అంటూ ఆయనపై మహిళా , ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. అటు దీనిపై స్పందించిన మాధవ్.. తన గౌరవ మర్యాదలకు భంగం కలిగించేలా తెలుగుదేశం పార్టీ కుట్ర చేసిందని ఆరోపించారు. దీని వెనుక టీడీపీ నేతలు చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ వున్నారని మాధవ్ వ్యాఖ్యానించారు. అయితే ఎంపీ వ్యాఖ్యలపై టీడీపీ నేత చింతకాయల విజయ్ స్పందించారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
నీ సుందర ప్రతిబింబాన్ని చూసి జనం ఏమైపోయారో:
మాధవ్ వీడియోకు తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. టీడీపీ ప్రధాన కార్యదర్శిగా వున్న తనకు ఆయన పర్సనల్ వీడియోతో ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. ఎంపీగా వున్న మాధవ్.. దేశ పార్లమెంట్‌కు, ఓటేసిన ప్రజలకు, కుటుంబానికి సమాధానం చెప్పాల్సి వుంటుందని విజయ్ పేర్కొన్నారు. అయినా మాధవ్ సుందర ప్రతిబింబాన్ని చూడటానికి ఎవరికి గుండెలు సరిపోవని.. ఆ వీడియో చూసిన జనం ఏమైపోయారో టెన్షన్‌గా వుందంటూ విజయ్ సెటైర్లు వేశారు.
నువ్వేమైనా టామ్‌క్రూజ్‌వా .. నీ వీడియోలు మార్ఫింగ్ చేయడానికి :
అయినా ఇలాంటి వీడియోలు మార్ఫింగ్ చేయడానికి నువ్వేమన్నా టామ్ క్రూజ్‌వా.. హాలీవుడ్ యాక్టరువా... ఈ రోజు వరకు మాధవ్ ఎవడో ఏంటో తెలీదన్నారు. మాధవ్ చరిత్ర అందరికీ తెలుసునని, కియో కంపెనీ ప్రతినిధులపై విరుచుకుపడిన చరిత్ర ఆయనదని విజయ్ ఆరోపించారు. తక్షణమే మాధవ్‌ను జగన్ సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మీసం తిప్పాడని, తొడగొట్టాడని జగన్ టికెట్ ఇచ్చారని.. లైవ్‌లో కూర్చొని ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలి కానీ.. ఈ వీడియోలేంటీ అంటూ చింతకాయల విజయ్ ఫైరయ్యారు. ఫోరెన్సిక్ టెస్టులో అసలు నిజం తెలుస్తుందని .. ఈ వ్యవహారంలో తన పేరు బయటకు తీసినందుకు మాధవ్‌పై పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు.
అసలేం జరిగిందంటే :
రెండ్రోజుల క్రితం ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆయన దుస్తులు లేకుండా వున్న తన వీడియోలు, ఫోటోలను సదరు మహిళకు చూపించడంతో ఆమె ఈ వీడియోను వైరల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ వెంటనే మీడియా సంస్థల్లోనూ ఈ వ్యవహారంపై కథనాలు వచ్చాయి.
మరోవైపు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోపై ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు. ఆ వీడియో వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాను జిమ్ చేసేటప్పటి వీడియోలను మార్ఫింగ్ చేశారని ఆయన ఆరోపించారు. అది ఫేక్ వీడియో అని తనను డ్యామేజ్ చేసి ఇబ్బంది పెట్టేందుకు టీడీపీ వాళ్లు చేస్తున్న కుట్ర అని మాధవ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై ప్రెస్ కౌన్సిల్, హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయిస్తానని.. ఈ ఘటన వెనుక వున్న వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు.