Chandrababu Naidu:టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్లు కొట్టివేత

  • IndiaGlitz, [Monday,October 09 2023]

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో మరోసారి తీవ్ర నిరాశ ఎదురైంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, అంగళ్లు అల్లర్ల కేసుల్లో ఆయన దరఖాస్తు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసుల్లో ఏ1, ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ఏ24గా ఉన్నారు. అంగళ్లు కేసులో అరెస్ట్ అయిన వారికి ఇప్పటికే హైకోర్టు బెయిల్ మంజూరు అయింది. అలాగే ఫైబర్ నెట్ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న హరిప్రసాద్‌కి బెయిల్ వచ్చింది.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణకి బెయిల్ వచ్చింది. దీంతో చంద్రబాబుకు కూడా ముందస్తు బెయిల్ లభిస్తుందనే ఆశలో టీడీపీ నేతలు ఉన్నారు. అయితే చంద్రబాబుకు తప్ప మిగిలిన వారందరికీ బెయిల్ రావడంతో తెలుగు తమ్ముళ్లు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ..

చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై కొన్ని రోజులుగా వాడివేడి వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరపున ఏఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును నేటికి రిజర్వ్ చేసింది. మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది. అలాగే స్కిల్ డెవలెప్‌మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఇవాళ మధ్యాహ్నం ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది.

చంద్రబాబు అరెస్టై నేటికి నెల రోజులు..

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టై నేటికి నెల రోజులు అవుతుంది. సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు 10వ తేదీ ఉదయం విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం న్యాయమూర్తి చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించారు. అలాగే రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతి ఇచ్చారు. తర్వాత రిమాండ్ ముగియడంతో రెండు సార్లు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

More News

Bigg Boss 7 Telugu : శుభశ్రీ, గౌతమ్ ఔట్.. ట్విస్ట్ ఇచ్చిన నాగ్, బిగ్‌బాస్ హౌస్‌లోకి ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్

బిగ్‌బాస్ 7 తెలుగులో ఆదివారం నాటి ఎపిసోడ్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది. ఊహించని ట్విస్టులు,

Ramya Krishna Meena:మంత్రి రోజాకు పెరుగుతున్న మద్దతు.. బండారుపై కఠిన చర్యలు తీసుకోవాలని రమ్యకృష్ణ, మీనా డిమాండ్

టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి రోజాకు అలనాటి హీరోయిన్లు నుంచి మద్దతు పెరుగుతూనే ఉంది.

Bandla Ganesh:కూకట్‌పల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీపై క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి.

Jagapathi Babu:వాళ్ల కష్టాల్ని, నా కష్టాలుగా భావించా.. నా అభిమానులే ఇలా చేస్తారనుకోలేదు : జగపతిబాబు సంచలన ప్రకటన

తెలుగు చిత్ర పరిశ్రమలో శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు దగ్గరైన నటుడు జగపతి బాబు.

K Raghavendra Rao:ఏపీ అంధకారంలో వుంది.. చంద్రుడు రావాలి, వెలుగు తేవాలి : కే. రాఘవేంద్రరావు పోస్ట్ వైరల్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో వున్న సంగతి తెలిసిందే.