Chandrababu Naidu:టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్లు కొట్టివేత
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో మరోసారి తీవ్ర నిరాశ ఎదురైంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, అంగళ్లు అల్లర్ల కేసుల్లో ఆయన దరఖాస్తు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసుల్లో ఏ1, ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ఏ24గా ఉన్నారు. అంగళ్లు కేసులో అరెస్ట్ అయిన వారికి ఇప్పటికే హైకోర్టు బెయిల్ మంజూరు అయింది. అలాగే ఫైబర్ నెట్ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న హరిప్రసాద్‌కి బెయిల్ వచ్చింది.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణకి బెయిల్ వచ్చింది. దీంతో చంద్రబాబుకు కూడా ముందస్తు బెయిల్ లభిస్తుందనే ఆశలో టీడీపీ నేతలు ఉన్నారు. అయితే చంద్రబాబుకు తప్ప మిగిలిన వారందరికీ బెయిల్ రావడంతో తెలుగు తమ్ముళ్లు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ..
చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై కొన్ని రోజులుగా వాడివేడి వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరపున ఏఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును నేటికి రిజర్వ్ చేసింది. మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది. అలాగే స్కిల్ డెవలెప్‌మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఇవాళ మధ్యాహ్నం ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది.
చంద్రబాబు అరెస్టై నేటికి నెల రోజులు..
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టై నేటికి నెల రోజులు అవుతుంది. సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు 10వ తేదీ ఉదయం విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం న్యాయమూర్తి చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించారు. అలాగే రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతి ఇచ్చారు. తర్వాత రిమాండ్ ముగియడంతో రెండు సార్లు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com