TDP:నడిసంద్రంలో టీడీపీ.. ఫ్రస్ట్రేషన్లో నేతలు, మహిళా మంత్రిపై దిగజారుడు మాటలు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగుదేశం పార్టీ పరిస్ధితి నడి సంద్రంలో నౌకలా మారింది. అధినేత చంద్రబాబు నాయుడు జైల్లో వుండగా, యువనేత నారా లోకేష్ ఢిల్లీని వదిలిరావడం లేదు. దీంతో పార్టీని , కేడర్‌ను నడిపించేవారు లేరు. రాష్ట్రవ్యాప్తంగా నేతలంతా ఎక్కడివారు అక్కడ గప్‌చుప్ అయ్యారు. ఎన్నికల సమయంలో యాక్టీవ్‌గా వుండాల్సిన కేడర్ సైలంట్ అవ్వడంతో తెలుగుదేశం కార్యక్రమాలు ఏం కనిపించడం లేదు. ఇప్పుడే పరిస్థితి ఇలా వుంటే రేపు చంద్రబాబు తర్వాత పార్టీ పరిస్థితి ఏంటీ..? తమ భవిష్యత్తు ఏంటి అన్న దానిపై నేతలకు భయం పట్టుకుంది.
నారా కుటుంబం దృష్టిలో పడేందుకు పాట్లు :
ఇదిలావుంటే.. పార్టీలోని పరిస్ధితిని చూసి కొందరు నేతలు హైలైట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరి కళ్లలో పడేందుకు .. సాధ్యమైనన్ని ఎక్కువ మార్కులు కొట్టేసేందుకు నానా తంటాలు పడుతున్నారు. వీరిలో ఒకరు విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి. దాదాపు 40 ఏళ్లుగా రాజకీయాలు చేస్తూ.. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఆయన హుందాగా మాట్లాడాలి. కానీ వాస్తవంలో జరుగుతున్నది మాత్రం వేరు. మహిళా మంత్రి రోజాని ఉద్దేశించి రాయడానికి వీల్లేని భాషలో దూషించారు.
రోజాపై సంచలన వ్యాఖ్యలు :
పాత చరిత్ర మరిచిపోలేక, ఎన్టీఆర్ బిడ్డల మీద, భువనేశ్వరి, బ్రాహ్మణి మీద దిగజారి మాట్లాడే అర్హత నీకు ఎవరిచ్చారు. ఎన్టీఆర్ కుటుంబం ఆదర్శమైన, మచ్చలేని కుటుంబమని.. సాంప్రదాయాలకే రోల్ మోడల్ అన్నారు. భువనేశ్వరి తల్లి ఏనాడూ రోడ్డు మీదకి రాలేదని.. ఆమె గురించి నువ్వు మాట్లాడుతున్నావా అంటూ బండారు సత్యనారాయణ మూర్తి ప్రశ్నించారు. నువ్వు ఏ సినిమాల్లో నటించావో తెలియదా..? నువ్వు చేసిన పనులన్నీ మాకు తెలుసునంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రికార్డింగ్ డ్యాన్సులు వేసుకునే నువ్వు, కిరాయికి వెళ్లావని .. ఇప్పుడు నువ్వు ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడు వీడు అంటావా అంటూ మండిపడ్డారు. నువ్వు ఎన్ని లాడ్జీలలో పడుకున్నావు, బజారుదానివి, నీ అదృష్టం బాగుండి మంత్రి అయ్యావంటూ బండారు ఫైర్ అయ్యారు. ఖబడ్దార్ రోజా.. నీ ఆ సినిమాలన్నీ బయటపెడతామని సత్యనారాయణ మూర్తి హెచ్చరించారు.
బండారుపై మండిపడుతున్న వైసీపీ నేతలు :
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పదవిలో ఉన్న ఒక మహిళా మంత్రి మీదనే ఇలా రౌడీ భాషలో దాడులు చేస్తుంటే మామూలు మహిళలకు వీళ్ళు ఎలాంటి గౌరవం ఇస్తారు ? అంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆలోచింపచేస్తోంది. చంద్రబాబు కుటుంబం దృష్టిలో పడాలని, వాళ్ల ఆశీస్సులు పొందాలని మహిళను అసభ్యకరంగా దూషిస్తారా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అధినేత దృష్టిలో పడటానికి రోడ్డెక్కి ధర్నాలు , నిరసనలు చేయొచ్చు. ప్రజా సమస్యలపై పోరాడొచ్చు. అవన్నీ వదిలేసి ఓ మహిళపై చౌకబారు ఆరోపణలు చేయడం ఏంటని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments