TDP-Janasena: జనసేనతో పొత్తు.. చంద్రబాబు కుటుంబంలో రచ్చ..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. అధికార, విపక్ష పార్టీలు కురుక్షేత్రానికి సిద్ధమయ్యాయి. సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ మిగిలిన పార్టీల కంటే ముందుకు దూసుకుపోతోంది. మరోవైపు టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని కిందా మీద పడుతున్నాయి. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల ఘోరంగా ఓడిపోయామని చంద్రబాబు, పవన్ కల్యాణ్ భావించారు. అందుకే ఈసారి పొత్తు దిశగా సాగారు. రెండు పార్టీల ఓట్లు చీలకూడదని నిర్ణయం తీసుకున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో తెలియని పరిస్థితి.
టీడీపీతో పొత్తుకు విముఖత..
మరోవైపు జనసేన క్యాడర్ టీడీపీతో పొత్తుకు సుముఖంగా లేదు. ఒంటరిగానే పోటీ చేస్తే వచ్చినన్ని సీట్లు వస్తాయి.. హుందాగా పోరాటం చేయవచ్చంటున్నారు. కానీ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాత్రం చంద్రబాబుతో ప్యాకేజీ తీసుకుని కమిట్ అయిపోయాడు. తాను తీసుకున్న నిర్ణయాన్ని మీరందరూ అంగీకరించాలని.. లేదంటే వైసీపీ కోవర్టులుగా భావిస్తానని హుకుం జారీ చేశారు. కనీసం పొత్తు గురించి బహిరంగంగా అభిప్రాయలు కూడా చెప్పకూడదని ఆంక్షలు విధించారు. దీంతో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి పచ్చ జెండాలు మోయాలా అని మదనపడిపోతున్నారు జనసైనికులు.
దిక్కుతోచని స్థితిలో జనసైనికులు..
ఈ నేపథ్యంలో జనసేన గ్రాఫ్ గణనీయంగా పడిపోతుంది. ఇది కొంతవరకు టీడీపీకి లాభించే విషయం. ఎందుకంటే జనసేనకు తక్కువ సీట్లు ఆఫర్ చేసే అవకాశం చంద్రబాబుకు దొరుకుతుంది. చరమాంక దిశలో ఉన్న టీడీపీ.. పవన్ చేయిపట్టుకుని ఈ ఎన్నికల్లో గట్టెక్కుదామని ప్రయత్నిస్తోంది. పవన్ సామాజిక వర్గంకు చెందిన ఓట్లు తెచ్చుకుందామని పగటి కలలు కంటోంది. అయితే జనసేన అభిమానులు మాత్రం తెలుగుదేశానికి ఊడిగం చేయలేమని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. దీనికి తోడు తెలంగాణాలో ఫలితాలు దారుణంగా రావడంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
చంద్రబాబు కుటుంబంలో తగాదాలు..?
రెండు పార్టీల అధినేతల మద్య సయోధ్య బాగానే ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఎక్కడా కూడా రెండు పార్టీల క్యాడర్‌కు పొసగడం లేదు. టీడీపీ నుండి సీటు ఆశీస్తున్న అభ్యర్ధులు జనసేన క్యాడర్‌ను అక్కున చేర్చుకోవడం లేదు. అంతేకాదు కొన్నిచోట్ల బాహబాహికీ దిగారు. రెండు పార్టీల మద్య పొత్తు అయితే కుదిరింది గాని సీట్ల షేరింగ్, సీఎం అభ్యర్ధి విషయంలో గాని క్లారిటీ లేదు. జనసేకు ఇచ్చే పది ఇరవై సీట్లతో సీఎం ఇచ్చేస్తారా అనేది టీడీపీ వాదిస్తుంటే.. తమ ద్వారా ఓట్లు తెచ్చుకుని కరవేపాకులా వాడుకుని వదిలేస్తారనేది జనసేన క్యాడర్ వాదిస్తుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్‌ను సీఎం అభ్యర్ధిగా అంగీకరించడానికి నారా లోకేష్ సన్నద్ధంగా లేరని సమాచారం. ఈ విషయంలో చంద్రబాబు కుటుంబంలోనూ తగదాలు జరిగాయని చెబుతున్నారు. దీంతో లోకేష్, బ్రాహ్మిణి అలిగి కొన్ని రోజులు ఫామ్ హౌస్‌కు వెళ్లిపోయారట. లోకేష్‌కు సర్దిచెప్పి బతిమాలి తిరిగి పాదయాత్ర ప్రారంభింపచేశారు. ఎంత కష్టపడినా జనాదరణ ఉండటం లేదని లోకేష్ భావిస్తున్నారట. దీంతో ఈనెల 20వ తేదీన పాదయాత్ర ముగించాలనే నిర్ణయానికి వచ్చారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout