TDP Jana Sena:ఏపీలో రోడ్ల దుస్థితిపై టీడీపీ-జనసేన ఉమ్మడి పోరు షూరూ
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో రోడ్ల దుస్థితిపై టీడీపీ-జనసేన ఆధ్వర్యంలో 'గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది సీఎం' పేరుతో ఉమ్మడి నిరసనలు చేపట్టారు. ఇవాళ(శనివారం), రేపు (ఆదివారం) రెండు పార్టీల కార్యకర్తలు రోడ్లపైకి రావాలిని, ఎక్కడ గుంత కనిపిస్తే అక్కడ సెల్ఫీ దిగాలని సీనియర్ నేతలు పిలుపునిచ్చారు. ఆ ఫొటోలు, వీడియోలు #GunthalaRajyamAP, #WhyAPHatesJagan హ్యాష్ ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో షేర్ చేయాలన్నారు. దీంతో రాష్ట్రంలో అధ్వానంగా తయారైన రహదారులతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వానికి తెలిసేలా ఆందోళనకు దిగారు. గుంతల రోడ్ల ఫొటోలు తీసి షేర్ చేస్తున్నారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని రెండు పార్టీలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటానికి కార్యాచరణ సిద్ధం చేశాయి. ప్రజాసమస్యలపై కలిసి పోరాటం చేస్తామని ప్రకటించాయి. ఇప్పటికే రెండు పార్టీల నేతలు సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు సీనియర్ నేతలు ఉమ్మడి మేనిఫెస్టో కార్యాచరణపైన చర్చించారు. నారా లోకేష్, పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో ఉమ్మడి సమన్వయ కమిటీ భేటీ కూడా నిర్వహించి ప్రభుత్వంపై ఎలా పోరాటం చేయాలనే దానిపైన సుదీర్ఘంగా చర్చించిన సంగతి తెలిసిందే.
మరోవైపు బీజేపీని కూడా తమ కూటమిలోకి రావాలని పవన్ కల్యాణ్ కోరుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారు. ఈ క్రమంలో ఏపీలోనూ టీడీపీ-జనసేన కూటమితో కలిసి ఎన్నికలకు వెళ్తామని బీజేపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రానున్నట్లు కమలం నేతలు భావిస్తున్నారు. ఇదే కనక నిజమైతే వైసీపీకి రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బ తగలనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే టీడీపీ-జనసేనతో పోలిస్తే బీజేపీకి పెద్దగా ఓట్లు రాకపోయినా ఎన్నికల సమయంలో కేంద్రం మద్దతు ఉంటే వైసీపీని ధీటుగా ఎదుర్కొనే అవకాశాలుంటాయి. మొత్తానికి చంద్రబాబు అరెస్టుకు ముందు, తర్వాత అనేలా ఏపీ రాజకీయాలు మారిపోయాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout