పేదలతో టీడీపీ ముఠా చెలగాటం.. డబ్బులు జమ అవ్వకుండా విశ్వప్రయత్రాలు..
- IndiaGlitz, [Friday,May 10 2024]
ఓటమి భయంతో టీడీపీ నేతలు దారుణంగా ప్రవరిస్తున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తు్న్నారు. ఈ క్రమంలోనే పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాల నిధులను నిలువునా అడ్డుకుంటున్నారు. దీంతో అసలు పేదలపై చంద్రబాబుకు ఎందుకు ఇంత కోపం అని ప్రజలు మండిపడుతున్నారు. పేదలకు మంచి జరగాలని సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమచేస్తు వస్తున్నారు. అలాగే ఈ ఏడాది కూడా కొన్ని పథకాలకు బటన్ నొక్కగా ఎన్నికల కోడ్‌తో నిధుల విడుదల ఆగిపోయాయి.
దీంతో ఎన్నికల సంఘానికి నిధుల విడుదలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది. అయితే ఈసీ మాత్రం అందుకు పర్మిషన్ ఇవ్వలేదు. తమకు ఫిర్యాదులు వచ్చినందునే పథకాలను నిలిపేశామని స్పష్టంచేసింది. అయితే ఈసీ నిర్ణయంపై కొంతమంది లబ్ధిదారులు, ప్రభుత్వం తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరగ్గా శుక్రవారం రాత్రి లోపు డబ్బులు జమచేయాలని గురువారం రాత్రి హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు కాపీతో అధికారులు ఎన్నికల ప్రధాన అధికారిని సంప్రదించారు. అయితే ఇప్పటివరకూ ఈసీ ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు.
దాంతో ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్నందున ఎన్నికల కమిషన్ క్లారిఫికేషన్ ఇస్తే తప్ప ముందుకు వెళ్లలేమని అధికారులు అంటున్నారు. మరోవైపు హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయనీయకుండా ఈసీపై టీడీపీ నేతలు ఒత్తిళ్లు చేస్తున్నంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ ఈసీ క్లారిఫికేషన్ ఆలస్యమైతే హైకోర్టు ఇచ్చిన గడువు ముగిపోతోందని లబ్ధిదారుల ఆవేదన చెందుతున్నారు. ఇదే సమయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను అడ్డుకునేందుకు టీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తుంది. నవతరం పార్టీ తరఫున పరోక్షంగా కోర్టులో అప్పీల్ వేయించింది. దీంతో పేదలకు డబ్బులు అందకుండా చేస్తున్న టీడీపీ బాగోతం బయటపడింది.