TDP: ఎలివేషన్లు బారెడు.. వచ్చిన సీట్లు చారెడు.. ఇది టీడీపీ తీరు..
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చే బిల్డప్‌లు ఇంకెవ్వరూ ఇవ్వలేరు. తానే గతంలో రాష్ట్రపతిని ఎంపిక చేశాను అంటారు.. కంప్యూటర్ కనిపెట్టాను అంటారు.. ఫోన్ కనిపెట్టాను అంటారు.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు. అధినేతకు తగ్గట్లు నేతలు కూడా ఎలివేషన్లు ఇచ్చుకోవడంతో ఎవరికి సాటి రారు. ఓడిపోతున్నామని తెలిసినా సరే క్యాడర్‌ను నిలబెట్టుకునేందుకు తప్పుడు ప్రచారాలు చేయడంలో వారికి వారే దిట్ట. అవాస్తవాలు సర్క్యులేట్ చేసి ఆనందపడుతూ ఉంటారు. ఇందుకు కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం.
ఉమ్మడి ఏపీతో పాటు జరిగిన గత నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పరిశీలిస్తే టీడీపీ సాధించిన సీట్లు ఏంటో.. ఆ పార్టీ పరిస్థి ఏంటో అర్థమైపోతుంది. 2004 ఎన్నికల్లో 294 సీట్లకు గానూ తెలుగుదేశం పార్టీ కేవలం సాధించి 34 సీట్లు మాత్రమే. ఇక 2009 ఎన్నికల్లో అయితే 92 స్థానాలు సాధించింది. ఇక రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేసింది. ఓవైపు మోదీ వేవ్.. మరోవైపు పవన్ కల్యాణ్ హీరో ఇమేజ్ తోడైనా కూడా 175 సీట్లలో కేవలం 102 సీట్లు మాత్రమే దక్కించుకుంది. 2019లో అయితే మరి దారుణంగా 23 సీట్లకే పరిమితమై ఘోరంగా ఓడిపోయింది.
ఇంత దరిద్రమైన ట్రాక్ రికార్డ్ ఉన్న టీడీపీ.. 2024లో మాత్రం 160 సీట్లు గెలుస్తామని బిల్డప్పులు ఇస్తోంది. చావుతప్పి కన్ను లోట్టబోయిన తీరున ఫలితాలు సాధించిన పచ్చ పార్టీ ఇప్పుడు వరల్డ్ కప్పు కొట్టబోతున్న రీతిలో ప్రగల్భాలు పలుకుతోంది. ఇప్పటివరకు కూటమిలోని మూడు పార్టీలకు సీట్ల షేరింగ్ ఇంకా జరగలేదు. ఇటు చూస్తే చంద్రబాబు సభలకు ప్రజల నుంచి స్పందన లేదు.
ఇక ప్రధాని మోదీ వచ్చిన చిలకూరిపేట సభపై భారీ అంచనాలు పెట్టుకున్నా అది కాస్త బెడిసికొట్టింది. ఈ సభలో ప్రధాని సీఎం జగన్‌పై గట్టిగా విమర్శలు చేస్తారని.. చంద్రబాబును గెలిపించమని చెబుతారని భావించినా అదీ జరగలేదు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో 160 సీట్లు వస్తాయని ఎలా భ్రమపడుతున్నరో పసుపు నేతలకే తెలియాలని రాజకీయ విశ్లేషకులు కూడా ఎద్దేవా చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments