Chandrababu Naidu:స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం : చంద్రబాబుకు షాక్.. రిమాండ్ పొడిగింపు , అక్టోబర్ 5 వరకు జైల్లోనే
Send us your feedback to audioarticles@vaarta.com
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్ట్ మరో బిగ్ షాక్ ఇచ్చింది. ఆయన రిమాండ్‌ను మరో 11 రోజులు పొడిగించింది. దీంతో అక్టోబర్ 5వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్‌లోనే వుండనున్నారు. ఇవాళ్టీతో ఆయన రిమాండ్ గడువుతో పాటు సీఐడీకి ఇచ్చిన రెండు రోజుల కస్టడీ గడువు కూడా ముగిసింది. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచే వర్చువల్‌గా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. చంద్రబాబు రిమాండ్‌ను పొడిగించాలని సీఐడీ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి అక్టోబర్ 5 వరకు రిమాండ్‌ను పొడిగించారు.
థర్డ్ డిగ్రీ ప్రయోగించారా .. చంద్రబాబుతో న్యాయమూర్తి :
ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. విచారణ సందర్భంగా సీఐడీ అధికారులు ఏమైనా ఇబ్బంది పెట్టారా .. వైద్య పరీక్షలు నిర్వహించారా..? థర్డ్ డిగ్రీ ప్రయోగించారా అని చంద్రబాబును ప్రశ్నించారు. అయితే అధికారులు ఇబ్బంది పెట్టలేదని ఆయన పేర్కొన్నారు. విచారణలో తేలిన అంశాల గురించి చంద్రబాబు అడగ్గా.. వాటిని బయటకు చెప్పకూడదని సీఐడీ దాఖలు చేసిన 500 పేజీల కాపీలను న్యాయవాది ద్వారా పంపుతామని జడ్జి చెప్పారు. ఇక బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరుపుతామని న్యాయమూర్తి వెల్లడించారు.
12 గంటలు .. 120 ప్రశ్నలు :
కాగా.. సీఐడీ విచారణలో మొత్తం చంద్రబాబును 30 అంశాలపై 120 ప్రశ్నలు సంధించారు. మొత్తంగా రెండు రోజుల్లో 12 గంటల పాటు చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నించారు. 13 చోట్ల సంతకాల విషయాన్ని కూడా సీఐడీ ప్రశ్నించింది. అయితే చంద్రబాబు తమ విచారణకు పూర్తి స్థాయిలో సహకరించలేదని, మరిన్ని వివరాలు రాబట్టేందుకు మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు కోర్టును కోరారు. అలాగే స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments