Chandrababu Naidu:స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం : చంద్రబాబుకు షాక్.. రిమాండ్ పొడిగింపు , అక్టోబర్ 5 వరకు జైల్లోనే

  • IndiaGlitz, [Monday,September 25 2023]

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్ట్ మరో బిగ్‌ షాక్ ఇచ్చింది. ఆయన రిమాండ్‌ను మరో 11 రోజులు పొడిగించింది. దీంతో అక్టోబర్ 5వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్‌లోనే వుండనున్నారు. ఇవాళ్టీతో ఆయన రిమాండ్ గడువుతో పాటు సీఐడీకి ఇచ్చిన రెండు రోజుల కస్టడీ గడువు కూడా ముగిసింది. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచే వర్చువల్‌గా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. చంద్రబాబు రిమాండ్‌ను పొడిగించాలని సీఐడీ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి అక్టోబర్ 5 వరకు రిమాండ్‌ను పొడిగించారు.

థర్డ్ డిగ్రీ ప్రయోగించారా .. చంద్రబాబుతో న్యాయమూర్తి :

ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. విచారణ సందర్భంగా సీఐడీ అధికారులు ఏమైనా ఇబ్బంది పెట్టారా .. వైద్య పరీక్షలు నిర్వహించారా..? థర్డ్ డిగ్రీ ప్రయోగించారా అని చంద్రబాబును ప్రశ్నించారు. అయితే అధికారులు ఇబ్బంది పెట్టలేదని ఆయన పేర్కొన్నారు. విచారణలో తేలిన అంశాల గురించి చంద్రబాబు అడగ్గా.. వాటిని బయటకు చెప్పకూడదని సీఐడీ దాఖలు చేసిన 500 పేజీల కాపీలను న్యాయవాది ద్వారా పంపుతామని జడ్జి చెప్పారు. ఇక బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరుపుతామని న్యాయమూర్తి వెల్లడించారు.

12 గంటలు .. 120 ప్రశ్నలు :

కాగా.. సీఐడీ విచారణలో మొత్తం చంద్రబాబును 30 అంశాలపై 120 ప్రశ్నలు సంధించారు. మొత్తంగా రెండు రోజుల్లో 12 గంటల పాటు చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నించారు. 13 చోట్ల సంతకాల విషయాన్ని కూడా సీఐడీ ప్రశ్నించింది. అయితే చంద్రబాబు తమ విచారణకు పూర్తి స్థాయిలో సహకరించలేదని, మరిన్ని వివరాలు రాబట్టేందుకు మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు కోర్టును కోరారు. అలాగే స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది.

More News

Purandeswari:సందు దొరికితే జగన్‌పై బురద జల్లాలనే.. తెలిసీ తెలియకుండా ఆ మాటలేంది చిన్నమ్మ

కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుగా వుంది ఏపీ కొత్త బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి. కీలకమైన ఎన్నికలకు ముందు సోము వీర్రాజును

Tirumala:తిరుమలలో రెచ్చిపోయిన దొంగలు : టీటీడీ ఉచిత బస్సు చోరీ, టైట్ సెక్యూరిటీ మధ్య ఎలా కొట్టేశారబ్బా

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తులను తిరుపతి నుంచి తిరుమలకు, తిరుమల నుంచి తిరుపతికి తరలించేందుకు టీటీడీ ఉచిత బస్సులు నడుపుతున్న సంగతి తెలిసిందే.

Bigg Boss 7 Telugu : నువ్వేమైనా పిస్తావా, సందీప్‌ను కడిగిపారేసిన నాగ్.. మూడవ హౌస్‌మేట్‌గా శోభాశెట్టి

బిగ్‌బాస్ 7 తెలుగు మూడో వారం చివరికి చేరుకుంది. ప్రస్తుతం ఇంటిలో పవర్ అస్త్ర కోసం పోటీ జరుగుతోంది.

National Leaders:బాబును నమ్మలేం : పట్టించుకోని జాతీయ నేతలు.. హస్తినలో లోకేష్ పాట్లు, ఎలా ముందుకు ..?

14 ఏళ్లు సీఎం, మరో 14 ఏళ్లు ప్రతిపక్షనేత.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత.

Nandamuri Balakrishna:బాబోయ్ బాలయ్య .. బయటకు తెవడం ఏమో గానీ, బావను ఇరికించేస్తావా ఏంది .?

ఎన్టీఆర్ కుమారుడే అయినా, స్వయంగా ఎమ్మెల్యే అయినా టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడింది చాలా తక్కువ.