Chandrababu Naidu: చంద్రబాబుకు ఏసీబీ కోర్ట్ షాక్, జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు

  • IndiaGlitz, [Friday,September 22 2023]

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు షాక్ తగిలింది. ఆయన జ్యుడిషియల్ రిమాండ్‌ను ఈ నెల 24 వరకు పొడిగిస్తున్నట్లు ఏసీబీ కోర్ట్ వెల్లడించింది. 14 రోజుల రిమాండ్ గడువు ముగియడంతో చంద్రబాబును గురువారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వర్చువల్‌గా కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా తనను జైలులో మానసిక క్షోభకు గురిచేస్తున్నారని.. తన హక్కులను రక్షించాలని, న్యాయాన్ని కాపాడాలని చంద్రబాబు న్యాయమూర్తిని కోరారు.

అన్యాయంగా అరెస్ట్ చేశారు : చంద్రబాబు

తనది 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితమని.. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా తనను అరెస్ట్ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసేంది తానేనని, అన్యాయంగా తనను అరెస్ట్ చేశారని ఇదే తన బాధ, ఆవేదన, ఆక్రందన అన్నారు. ఈ వయసులో తనకు పెద్ద శిక్ష ఇచ్చారని చంద్రబాబు దుయ్యబట్టారు. తనపై వున్నవి ఆరోపణలు మాత్రమేనని.. నిర్ధారణ కాలేదన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, తాను చట్టాన్ని గౌరవిస్తానని టీడీపీ అధినేత స్పష్టం చేశారు. తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని.. ఇదే నా బాధ, ఆవేదన , ఆక్రందన అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

చట్టప్రకారమే రిమాండ్ : చంద్రబాబుతో న్యాయమూర్తి

దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ.. మీరు దీనిని శిక్షగా భావించొద్దని, ప్రస్తుతం మీరు జ్యుడిషియల్ కస్టడీలో వున్నారని, పోలీస్ కస్టడీలో లేరని తెలిపారు. చట్ట ప్రకారమే మీకు రిమాండ్ విధించామని, జైలులో సౌకర్యాల విషయంలో ఇబ్బందులు వున్నాయని జడ్జి ప్రశ్నించారు. ఈ నెల 24 వరకు మీరు జ్యుడిషియల్ కస్టడీలోనే వుంటారని న్యాయమూర్తి పేర్కొన్నారు.

 

 

More News

Bigg Boss 7 Telugu : గౌతమ్‌కు అన్యాయం .. సందీప్‌పై గుస్సా, ప్రియాంకకున్న ధైర్యం అమర్‌‌కు లేకపోయే

బిగ్‌బాస్ 7 తెలుగులో మూడో హౌస్‌మెట్ ఛాన్స్ కొట్టేసేందుకు కంటెస్టెంట్స్ కుస్తీ పడుతున్నారు. శోభాశెట్టి, అమర్‌దీప్ చౌదరి, ప్రిన్స్ యావర్‌లను

తొడలు కొట్టుడేంది, మీసాలు తిప్పుడేంది : అసెంబ్లీ వేదికగా టీడీపీ 'గలీజు' రాజకీయం, బాబు కోసం ఇంత రచ్చా..?

చట్టసభలన్న గౌరవం లేదు.. సభాపతి అన్న మర్యాద లేదు. సభా సాంప్రదాయలను మంటగలిపి, కోట్లాదిమంది ప్రజలు చూస్తున్నారన్న ఇంగితం లేకుండా ప్రవర్తించారు

Navdeep:మాదాపూర్ డ్రగ్స్ కేసు.. హీరో నవదీప్‌కు నార్కోటిక్ నోటీసులు, విచారణకు రావాల్సిందిగా ఆదేశం

మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీనటుడు నవదీప్‌కు షాక్ తగిలింది. ఆయనకు నార్కోటివ్ విభాగం గురువారం 41 ఏ నోటీసులు జారీ చేసింది.

Akhil Mishra:షూటింగ్‌లో ప్రమాదం .. 3 ఇడియట్స్ నటుడు మృతి, బాలీవుడ్ దిగ్భ్రాంతి

చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. హిందీ నటుడు అఖిల్ మిశ్రా ప్రమాదవశాత్తూ కన్నుమూశారు.

జీ తెలుగు ఆధ్వర్యంలో పర్యావరణ హితంగా అప్ సైకిల్డ్ గణేష్ నవరాత్రులు!

గణపతిబప్పా.. మోరియా’ అంటూ దేశమంతటా ఘనంగా జరుపుకొనే పండుగ ‘గణేష్ చతుర్థి’. వీధివీధినా మండపాలు ఏర్పాటు చేసి గణపతి నవరాత్రులను కోలాహలంగా నిర్వహిస్తారు.