భార్యపై కామెంట్స్... చంద్రబాబు కంటతడి, సీఎం అయ్యాకే మళ్లీ అసెంబ్లీకి వస్తానంటూ శపథం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు రెండో రోజు వాడీవేడిగా సాగాయి. వ్యవసాయంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. అంబటిని ఉద్దేశించి టీడీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ క్రమంలో అంబటి రాంబాబు రెచ్చిపోయారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో సభలో గందరగోళం ఏర్పడింది. ఈ సందర్భంగా మంత్రులు, వైసీపీ సభ్యుల తీరును చంద్రబాబు తప్పుబట్టారు.

రెండున్నరేళ్లగా తన జీవితంలో ఎప్పుడూ లేని అవమానాలను భరించానని.. సభలో ఎన్నో చర్చలు చూశాం కానీ, అవమానం ఎప్పుడూ ఎదుర్కోలేదన్నారు చంద్రబాబు. వ్యక్తిగతంగా తనను దూషించారని.. తన కుటుంబ సభ్యుల్ని కూడా రోడ్డు మీదకు లాగారని ఆరోపించారు. సభలో చాలా అసభ్యంగా మాట్లాడారని.. తన భార్యను కించపరుస్తూ మాట్లాడారని... సభలో తన భార్య గురించి మాట్లాడటంపై పార్టీ ఎమ్మెల్యేల భేటీలో తీవ్ర ఎమోషనల్ అయిన బాబు.. కంటతడి పెట్టారు. సభలో తన కుటుంబం గురించి మాట్లాడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ శపథం చేశారు. సభ్యులందరికి నమస్కారం చేస్తూ చంద్రబాబు సభను వీడారు.

More News

బిగ్‌బాస్ 5 తెలుగు: దీప్తి గుర్తుల్లో షన్నూ.. హేట్ యూ అన్న సిరికి హగ్గులు, అంతలోనే షాక్

బిగ్‌బాస్ 5 తెలుగులో ఈ రోజు ఎపిసోడ్ అనేక మలుపులతో సాగింది. సిరి, షణ్ముఖ్, ప్రియాంకలు తమ ప్రేమ కోసం తపిస్తున్నారు.

నెలల వ్యవధిలో కన్నడ స్టార్ హీరో ఇంట్లో మరో విషాదం

ప్రముఖ కన్నడ నటుడు దునియా విజయ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి రుద్రప్ప (81) కన్నుమూశారు.

మన్మథుడి పక్కన ఛాన్స్.. ఎగిరిగంతులు వేయాల్సిందిపోయి, ఈ డిమాండ్లు ఏంటీ..?

కింగ్ అక్కినేని నాగార్జున సినిమాల విషయంలో స్పీడ్ పెంచారు. ఇప్పటికే బంగార్రాజును శరవేగంగా పూర్తి చేస్తున్న ఆయన ..

అద్భుతం... నిజంగా అద్భుతం !!

అద్భుతం... డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రేక్షకులను నవంబర్ 19న థ్రిల్ చేయబోతున్న ఒక కంప్లీట్ డిజిటల్ ట్రీట్. నేడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కాబోతున్న

ఎక్కువ ట్విస్ట్‌లు, టర్నింగ్‌లు ఉన్న ఎంగేజింగ్‌ కథ ‘అద్భుతం’ : యంగ్‌ హీరో తేజ సజ్జా

‘ఓ బేబి’, ‘జాంబిరెడ్డి’ వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన యంగ్‌ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో,