భార్యపై కామెంట్స్... చంద్రబాబు కంటతడి, సీఎం అయ్యాకే మళ్లీ అసెంబ్లీకి వస్తానంటూ శపథం
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు రెండో రోజు వాడీవేడిగా సాగాయి. వ్యవసాయంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. అంబటిని ఉద్దేశించి టీడీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ క్రమంలో అంబటి రాంబాబు రెచ్చిపోయారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో సభలో గందరగోళం ఏర్పడింది. ఈ సందర్భంగా మంత్రులు, వైసీపీ సభ్యుల తీరును చంద్రబాబు తప్పుబట్టారు.
రెండున్నరేళ్లగా తన జీవితంలో ఎప్పుడూ లేని అవమానాలను భరించానని.. సభలో ఎన్నో చర్చలు చూశాం కానీ, అవమానం ఎప్పుడూ ఎదుర్కోలేదన్నారు చంద్రబాబు. వ్యక్తిగతంగా తనను దూషించారని.. తన కుటుంబ సభ్యుల్ని కూడా రోడ్డు మీదకు లాగారని ఆరోపించారు. సభలో చాలా అసభ్యంగా మాట్లాడారని.. తన భార్యను కించపరుస్తూ మాట్లాడారని... సభలో తన భార్య గురించి మాట్లాడటంపై పార్టీ ఎమ్మెల్యేల భేటీలో తీవ్ర ఎమోషనల్ అయిన బాబు.. కంటతడి పెట్టారు. సభలో తన కుటుంబం గురించి మాట్లాడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ శపథం చేశారు. సభ్యులందరికి నమస్కారం చేస్తూ చంద్రబాబు సభను వీడారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com